ఓటుకు నోటు కేసులో క‌నిపించ‌ని చంద్ర‌బాబు పేరు

విధాత,హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊర‌ట ల‌భించింది. ఏసీబీ చార్జ్‌షీట్‌లో చంద్రబాబునాయుడు పేరు కనిపించలేదు. ఈ కేసులో ఎంపీ రేవంత్‌రెడ్డిపై ఈడీ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఏసీబీ చార్జ్‌షీట్‌ ఆధారంగా ఎంపీ రేవంత్‌పై మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రేవంత్‌రెడ్డి 50 లక్షలు ఇచ్చినట్టు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. మండలి ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ చేసే విధంగా.. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రాయబారం నడిపినట్టుగా రేవంత్‌రెడ్డిపై చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. వేం […]

  • Publish Date - May 27, 2021 / 11:10 AM IST

విధాత,హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊర‌ట ల‌భించింది. ఏసీబీ చార్జ్‌షీట్‌లో చంద్రబాబునాయుడు పేరు కనిపించలేదు. ఈ కేసులో ఎంపీ రేవంత్‌రెడ్డిపై ఈడీ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఏసీబీ చార్జ్‌షీట్‌ ఆధారంగా ఎంపీ రేవంత్‌పై మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రేవంత్‌రెడ్డి 50 లక్షలు ఇచ్చినట్టు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. మండలి ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ చేసే విధంగా.. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రాయబారం నడిపినట్టుగా రేవంత్‌రెడ్డిపై చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. వేం నరేందర్‌రెడ్డికి ఓటు వేయాల్సిందిగా ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభాలకు గురిచేశారని ఏసీబీ అభియోగం మోపింది. ఛార్జ్‌షీట్‌లో ప్రధాన నిందితుడిగా ఎంపీ రేవంత్‌రెడ్డిని మాత్ర‌మే పేర్కొన్నారు.