విధాత: భారత గడ్డపై చీతాలు తిరిగి నడయాడుతున్నాయి. ప్రాజెక్టు చీతా విజయవంతంపై కూనో నేషనల్ పార్క్ ఎక్స్ వేదికగా చీతాల ఫోటోలను పోస్టు చేసింది. చారిత్రాత్మక వన్యప్రాణుల పునరాగమనం..చీతాలు మళ్ళీ భారత గడ్డపై నడుస్తున్నాయంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.
భారత్ లో అంతరించిన చీతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ప్రాజెక్టు చీతా’లో భాగంగా 2022 సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చీతాలను(ఐదు ఆడ, మూడు మగ చీతాలు) కునో పార్కులోని ఎన్‌క్లోజర్లలోకి విడుదల చేశారు.
2023 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన మరో 12 చీతాలను వదిలారు. అయితే, ప్రస్తుతం కునో జాతీయ పార్కులో 28 చీతాలు ఉన్నాయి. వీటిలో ఎనిమిది దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతాలు కాగా.. నాలుగు నమీబియా చీతాలు ఉన్నాయి. మిగతావి భారత గడ్డపై జన్మించిన 16 కూనలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.