విధాత: అల్లు రామ లింగయ్య జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించిన చిరంజీవి. రాజమండ్రి- తో నాకు విడదీయరాని బంధం వుంది.నాతొలి సినిమా పునాది రాళ్ళు తర్వాత ప్రాణం ఖరీదు, మనఊరి పాండవులు ఇక్కడే నటించా,అల్లు రామలింగయ్య గారితో గురుశిష్యుల అనుబంధం నాది.ఆయన స్పూర్తి ప్రదాత,హోమియో పతిని ఉమాపతిగా పలికేవాడినని చిరంజీవి వెల్లడించారు.
మనఊరి పాండవులు చిత్రం లోనే నాకు అల్లు రామలింగయ్య పరిచయం అప్పుడే నన్ను వలలో (అల్లుడుగా ) వేసుకున్నారనిపిస్తాది.వానాకాల చదువులు చదివిన రామలింగయ్య గారు బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన అనుకుంటే ఏదైనా,సాధించేవారు.నిత్యవిద్యార్ధిగా అల్లు గారు వుండేవారు హోమియో పతి అల్లుగారితోనే కాదు మా అమ్మగారితోనే నాకు అలవాటు అల్లు రామలింగయ్య గారి హోమియో మాత్రలివ్వడానికి అనేక ప్రశ్నలు వేసి మందిచ్చేవారు.
గ్యాంగ్రెన్ వ్యాధులను కూడా రామలింగయ్యగారు నయం చేసేవారుహొమియోపతిలో ఏ రోగానికి అయినా మందు వుంటుంది.నా ఇంట్లో అందరమూ హోమియోపతి ఇప్పటికీ వాడుతూనే వుంటాం,అల్లు రామలింగయ్య గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు,నా డబ్బులు కాదు.. నా రాజ్యసభ నుంచి కాలేజీకి 2 కోట్లు ఇచ్చానంతే అని పేర్కొన్నారు.