తల్లీకొడుకులను బలిగొన్న కరోనా

విధాత,ఉంగుటూరు: కరోనా మహమ్మారికి రోజుల వ్యవధిలో తల్లి, కొడుకు మృత్యువాత పడిన ఘటన నారాయణపురంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గంటా తాతాజీ (30) స్థానికంగా రేషన్‌ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు.ఈ నెల 5న తాతాజీ కరోనా బారిన పడ్డారు. ప్రైమరీ కాంటాక్టు అయిన అతని తల్లి అన్నపూర్ణ (51)కి కరోనా సోకింది. తొలుత ఇద్దరూ ఇంట్లోనే చికిత్స పొందారు. మూడు రోజుల వ్యవధిలో తల్లి, కొడుకుని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో ఈ […]

  • Publish Date - June 17, 2021 / 09:12 AM IST

విధాత,ఉంగుటూరు: కరోనా మహమ్మారికి రోజుల వ్యవధిలో తల్లి, కొడుకు మృత్యువాత పడిన ఘటన నారాయణపురంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గంటా తాతాజీ (30) స్థానికంగా రేషన్‌ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు.ఈ నెల 5న తాతాజీ కరోనా బారిన పడ్డారు. ప్రైమరీ కాంటాక్టు అయిన అతని తల్లి అన్నపూర్ణ (51)కి కరోనా సోకింది.

తొలుత ఇద్దరూ ఇంట్లోనే చికిత్స పొందారు. మూడు రోజుల వ్యవధిలో తల్లి, కొడుకుని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ పరిస్థితి విషమించడంతో ఈ నెల 10వ తేదీన ఆమె మృతి చెందగా బుధవారం తెల్లవారుజామున తాతాజీ కూడా మరణించారు. ప్రస్తుతం తాతాజీ భార్య ఎనిమిది నెలల గర్భిణి. రోజుల వ్యవధిలో కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.