Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు అంటే మన తెలుగు వారికి ఏండ్ల తరబడి చెరగని నమ్మకం. లేచిన నుంచి నిద్రించే వరకు మంచే జరగాలని కోరుకుంటూ ఉంటాం. అందుకే రాశి ఫలాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మన పనులు నిర్వహిస్తూ ఉంటాం. దాని ప్రకారమే నడుచుకుంటూ ఉంటాం కూడా. అందుకే నిద్ర లేవగానే మొదట చాలామంది వెతికేది వారికి ఆరోజు ఎలా ఉండబోతుందనే. అలాంటి వారందరి కోసం మార్చి 18, మంగళవారం రోజు వారి పేర్ల పేర రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేషం (Aries) : ఈ రాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ముందస్తు ప్రణాళికలతో అనుకున్నది సాధిస్తారు. ప్రతి పనిలో కుటుంబ సహకారం ఉంటుంది. సమయానికి ధనం చేరుతుంది. వృత్తి, వ్యాపారాల్లో వృద్ధితో పాటు నూతన బాధ్యతలు వస్తాయి. చట్టపరమైన వ్యవహారాలకు దూరంగా ఉండాలి. హనుమాన్ చాలీసా పారాయణ చేయడం క్షేమకరం.
.
వృషభం (Taurus) : వీరికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పనుల్లో ఆటంకాలు తప్పవు. సమస్యలను బుద్ధి, పట్టుదలతో ఎదుర్కొంటారు. ఏరి, కోరి మరి సమస్యలు కొని తెచ్చుకోవద్దు. కొంత మనస్తాపం తప్పదు. ఉద్యోగంలో స్థాన చలనం అధేవిధంగా ఆదాయాన్ని మించి ఖర్చు చేసే అవకాశం. శివారాధన మేలు చేకూరుస్తుంది.
మిథునం (Gemini) : వీరికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో ఫలితాలు ఉంటాయి. గతాన్ని విడివడం మంచిది లుకుంటే భవిష్యత్తులో సమస్యలు వచ్చే అవకాశం. కీలక వ్యవహారాల్లో ఉత్సాహంగా ఉండాలి. అనారోగ్య సమస్యలు ఉంటాయి. సూర్య ఆరాధన చేయడం మంచిది.
కర్కాటకం (Cancer) : ఈ రోజు ఈ రాశి వారందరికీ అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో బంధుమిత్రుల సందడి ఎక్కువగా ఉంటుంది. ఫ్యామిలీతో విలువైన సమయం హ్యాపీగా గడుపుతారు .ఓ శుభవార్త వింటారు. ప్రయాణాలు అనుకూలంగా ఉండడంతో పాటు, ఆర్థిక వృద్ధి సాధిస్తారు. ఇష్ట దేవతారాధన చేయాలి.
సింహం (Leo) : వీరికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. షేర్లు, స్టాకుల ద్వారా లబ్ధి అందుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు దక్కుతాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. పాత బకాయిల సమస్యలన్నీ తీరుతాయి. ఎంతసేపు ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకుంటారు,ఖర్చు చేస్తారు. ఆరోగ్య సమస్యలు ఉండవు. శ్రీలక్ష్మీ ధ్యానం చేయడం మంచిది.
కన్య (Virgo) : వీరికి ఈ రోజు శుభప్రదంగా, లాభదాయకం. వీరి ఖ్యాతి, ప్రజాదరణ పెరుగుతుంది. లక్ష్మీదేవి రాక పెరుగుతుంది. స్నేహితుల సాయంతో వృత్తి పరంగా కొత్త అవకాశాలు పొందుతారు. ఆరోగ్యం చేతిలో ఉంటుంది. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయ సందర్శిస్తే లాభం ఉంటుంది.
తుల (Libra) : వీరికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి అదృష్టం వరిస్తుంది. దైవభక్తితో క్లిష్ట పనులు సైతం పూర్తి చేస్తారు. కీర్తి ప్రతిష్టలు రెండింతలు పెరుగుతాయి. బంధు మిత్రులతో కలిసి ఉంటే విజయాలు దక్కుతాయి. కుటుంబంలో సంతోషాలు నిండుతాయి. ఇష్టదేవతత స్తోత్రాలు పఠించాలి.
వృశ్చికం (Scorpio) : వీరికి నేడు మిశ్రమంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో వారికి పనిభారం అధికమవుతుంది. ప్రారంభించిన పనులు పూర్తవడంతో పాటు ప్రశంసలు లభిస్తాయి. ఎంతో పట్టుదలతో తమ ప్రతికూల పరిస్థితులను సైతం అధిగమించి, ప్రశాంతంగా గడుపుతారు. కార్యసిద్ధి హనుమ ఆరాధన ఫలితం ఇస్తుంది.
ధనుస్సు (Sagittarius) : వీరికి ఈ రోజు సాధారణంగానే గడుస్తుంది. చేసే వృత్తి, వ్యాపారాల్లో సరైన ఫలితాలు ఉండకపోవచ్చు. ఊహించని ఘటనలు ఎదురవడంతో పాటు,జాబ్‌లో పనిఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పెద్దల సూచనలు పాటిస్తే కాస్త సౌఖ్యం లభిస్తుంది. మీ జీవిత భాగస్వామి అభిప్రాయాలు గౌరవిస్తే మేలు. అభయ ఆంజనేయస్వామి ప్రార్థన చేయాలి.
మకరం (Capricorn) : వీరికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. నక్షత్రాలన్నీ అనుకూలంగా ఉంటాయి. చేపట్టిన ప్రతి పనిలో ముఖ్యంగా వ్యాపార రంగంలో మంచి లాభం పొందుతారు. ప్రతి ప్రయత్నానికి విజయం వరిస్తుంది. బంధు మిత్రులతో సరదాగా ఉంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆదిత్య హృదయం పారాయణం చేస్తే శుభం.
కుంభం (Aquarius) : ఈ రోజు వీరికి మెరుగ్గా ఉంటుంది అన్ని రంగాల్లో సక్సెస్ అవుతారు. పట్టుదలతో చేసే పని సిద్ధిస్తుంది. మీ సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది. కుటుబ సభ్యులతో చాలా ఆనందకరంగా, విలువైన సమయం గడుపుతారు. ఇష్ట,కుల దేవతల ఆలయాలను దర్శించుకుని, దైవ దర్శణం చేసుకుంటే మంచిది.
మీనం (Pisces) : ఈ రోజు సాధారణంగానే ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు తప్పవు. వృత్తి వ్యాపారాలలో జాగ్రత్త వహించాలి. బంధువుల ప్రవర్తనతో విచారం. ఖర్చులు పెరగకుండా చూసుకోవడంతో పాటు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ఫలితం ఉంటుంది.