విధాత: తమిళనాట ఓ ఆసక్తికరమైన కాంబినేషన్ తెరమీదకు వచ్చింది. ఇటీవల బ్రదర్ అనే సినిమాతో మెప్పించిన తమిళ అగ్ర నటుడు జయం రవి (Jayam Ravi) హీరోగా దాదా ఫేం గణేశ్ కే బాబుర్ దర్శకత్వంలో ఓ కొత్త సినిమా పట్టాలెక్కింది. శనివారం పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈ మూవీ షూటింగ్ ప్రారంభించారు.
అయితే ఈ సినిమాకు హీరోయిన్‌గా ప్రస్తుతం తమిళనాడు డీజీపీ శంకర్ జివాల్ కుమార్తె దైడీ జివాల్ (Daudee Jiwal)ను ఎంపిక చేయడం విశేషం. దైడీ ఈ సినిమాతోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుండగా ఈ వార్త ఇప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇదిలాఉండగా ప్రస్తుతం గూగుల్, సోషల్ మీడియాల్లో ఈ అమ్మడి గురించి తెగ వెతుకుతుండగా తన ఫొటోలను, అందాలను చూసి అశ్చర్యపోతున్నారు.
దైడీ అంతకుముందు గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేసిన ఓ మ్యూజిక్ అల్బమ్‌లోనూ నటించింది.