Pre Wedding Shoot | మిగిలిన వారితో పోలిస్తే తమ ప్రీ వెడ్డింగ్ షూట్ డిఫరెంట్‌గా ఉండాలని నేటి తరం జంటలు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే ఛాన్స్ అని ఫొటోగ్రాఫర్లు కూడా టాలెంట్ పేరుతో తమ పైత్యాన్ని చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే పెళ్లి పీటలు ఎక్కాల్సిన జంటతో నీటిలో తేలిన శవాల్లా ఫొటోలు తీశారు. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాను షేక్ చేస్తోంది.
ప్రీ వెడ్డింగ్ షూట్ పేరు చెప్పి వధూవరులతో ఫొటోగ్రాఫర్లు చేయిస్తున్న విన్యాసాలు ఇప్పటికే చాలాసార్లు విమర్శలపాలయ్యాయి. ఒకసారి కొత్త జంట బట్టల్లేకుండా దుప్పట్లు చుట్టుకుని చేసిన ఫొటోషూట్ అప్పట్లో ట్రెండింగ్‌గా మారింది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అలాగే కొత్త జంటను బురదలో దొర్లించి తీసిన ఫొటోషూట్‌పైనా బాగానే కామెంట్లు వచ్చాయి. ఇప్పుడు వాటన్నింటినీ మించిన ప్రీ వెడ్డింగ్ షూట్ వైరల్ అవుతున్నది. కేవలం 11 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియోలో చెరువులో దూకిన తర్వాత శవాలు బయటకు తేలినట్లుగా కొత్త జంట పడుకుని ఉండగా తీసిన వీడియోను చూసి జనాలు షాకవుతున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. పెళ్లి పీటలు ఎక్కే కొత్త దంపతులు నీటిలో శవాల్లా తేలుతూ ఫోజులిస్తుంటే.. ఫొటోగ్రాఫర్ ఇలా కాదు.. అలా ఉండాలంటూ ఫోజ్ సెట్ చేస్తున్నాడు. ఇది చూసిన జనాలు ఓరి నాయనో.. ఇదేం పైత్యం.. ఇదేం బీభత్సం అంటూ ఆశ్చర్యపోతున్నారు. అందమైన లొకేషన్లలో ఫొటోలు దిగాల్సిన కొత్త జంటకు ఇదేం పోయేకాలమని మండిపడుతున్నారు.
అసలు ఆ వీడియో చూసి ఇది ప్రీవెడ్డింగ్ షూట్ అన్నట్లుగా లేదని.. ఏదో క్రైమ్ థిల్లర్ తీస్తున్నట్లుగా ఉందని జనాలు అనుకుంటున్నారు. దీనిపై సోషల్‌మీడియాలో విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ప్రీ వెడ్డింగ్ షూట్ కాదు.. క్రైమ్ పెట్రోల్ షూటింగ్‌లా ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు. దీనిని ప్రీ వెడ్డింగ్ షూట్ అనే బదులు.. ప్రీ డెత్ షూట్ లేదా సూసైడ్ ప్రాక్టీస్ అనడం బెటర్ అని మరికొందరు విమర్శిస్తున్నారు.
Pre Wedding Shoots are getting too weird 😂😂 pic.twitter.com/xhVKjoZrVy
— Rosy (@rose_k01) March 18, 2026
