Anupama Parameswaran | ప్రస్తుతం టాలీవుడ్లో మలయాళ ముద్దుగుమ్మల హవా నడుస్తుంది. ఒకరి తర్వాత మరొకొరు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో వారి మధ్య పోటీ ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో వరుస ఆఫర్స్ దక్కించుకునేందుకు గ్లామర్ షోని ఆయుధంగా వాడుతున్నారు. ఒకప్పుడు చాలా పద్దతిగా కనిపించిన భామలు కూడా ఇప్పుడు ఎద ఎత్తులతో పాటు నడుము అందాలని చూపిస్తూ నిర్మాతల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు ప్రేమమ్‌లో నటించి.. తెలుగు కుర్రకారుకి నిద్ర పట్టకుండా చేసిన […]
ప్రస్తుతం టాలీవుడ్లో మలయాళ ముద్దుగుమ్మల హవా నడుస్తుంది. ఒకరి తర్వాత మరొకొరు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో వారి మధ్య పోటీ ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో వరుస ఆఫర్స్ దక్కించుకునేందుకు గ్లామర్ షోని ఆయుధంగా వాడుతున్నారు.
ఒకప్పుడు చాలా పద్దతిగా కనిపించిన భామలు కూడా ఇప్పుడు ఎద ఎత్తులతో పాటు నడుము అందాలని చూపిస్తూ నిర్మాతల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు ప్రేమమ్‌లో నటించి.. తెలుగు కుర్రకారుకి నిద్ర పట్టకుండా చేసిన అనుపమ.. ఇటీవల సోషల్ మీడియా వేదికగా అందాల విందును ప్రదర్శిస్తూ మంత్ర ముగ్ధులని చేస్తుంది. తాజాగా అనుపమ షేర్ చేసిన పిక్స్ కాక రేపుతున్నాయి.
అనుపమ షేర్ చేసిన ఫొటోల్లో అనుపమ కర్లీ హెయిర్ తో కనిపిస్తూ ఉండగా, ఆమె చీరలో నడుము ఒంపు సొంపులు చూపిస్తూ అందాల ట్రీట్ ఇచ్చింది. అనుపమ ఎద అందాలతో పాటు… నడుము అందాలను ప్రదర్శించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
చీరను కాస్త కిందకు లాగి చూపిస్తూ.. కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్న అనుపమ పిక్స్‌కి నెటిజన్స్ లైక్స్, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పట్నుంచి ఒక లెక్క అన్నట్లు అనుపమ హాట్ షో ఉంది. సినిమాలో క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎలాంటి హాట్ షోకి అయిన తాను రెడీ అన్నట్టు ఈ అమ్మడి గ్లామర్ షో ఉంది.
ఇక అనుపమ కెరీర్ విషయానికి వస్తే కార్తీకేయ 2 సినిమాతో భారీ హిట్టు కొట్టిన అనుపమ ప్రస్తుతం ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈగల్ అనే ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్యాన్ ఇండియా చిత్రంగా రూపొందుతుండగా, ఇందులో రవితేజకు జోడీగా అనుపమను సందడి చేయబోతుంది.
ఇక డీజే టిల్లు 2 చిత్రంలో అనుపమ ఎంపికైనట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల పాటు షూట్లో కూడా పాల్గోంది. అయితే హీరో, హీరోయిన్స్ మధ్య కొన్ని భేదాభిప్రాయాలు రావడం వలన అనుపమ ఆ సినిమా నుండి తప్పుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం అనుపమ తమిళం, తెలుగు, మలయాళంలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.