‘ఉస్తాద్ భగత్ సింగ్’ సమీక్ష: గబ్బర్‌సింగ్ సీసాలో భగత్‌సింగ్ సారా.. అభిమానులకు కిక్కిచ్చే ‘ఉస్తాద్’

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా మాస్ ఎలిమెంట్స్‌తో అభిమానులను మెప్పించినా, కథనం మాత్రం పాత ఫార్ములాలోనే సాగింది. పూర్తి సమీక్ష.

Ustaad Bhagat Singh movie review poster featuring Pawan Kalyan intense close-up with his default mannerism

‘ఉస్తాద్ భగత్ సింగ్’ రివ్యూ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ గాంభీర్య వదనం.

Ustaad Bhagat Singh Review: Pawan Kalyan Impresses in Routine Mass Entertainer

విధాత వినోదం డెస్క్​ | 19 మార్చి 2026 | హైదరాబాద్​:

నటీనటులు : పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశీ ఖన్నా, రావు రమేష్, కే ఎస్ రవికుమార్, గౌతమి, టెంపర్ వంశీ తదితరులు.
దర్శకుడు : హరీష్ శంకర్
నిర్మాణం : మైత్రి మూవీ మేకర్స్
సంగీత దర్శకుడు : దేవిశ్రీప్రసాద్
సినిమాటోగ్రాఫర్ : అయానకా బోస్
ఎడిటర్ : కార్తిక్ శ్రీనివాస్

Ustaad Bhagat Singh Review:  ఉగాది సందర్భంగా విడుదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మాస్ ట్రీట్‌లా నిలుస్తుంది. దర్శకుడు హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’ ఫార్ములాను మళ్లీ ఉపయోగిస్తూ, ఈసారి భగత్ సింగ్ స్ఫూర్తి, రాజకీయ టచ్ కలిపి సినిమా రూపొందించినట్టు కనిపిస్తుంది. అయితే కథ, కథనం పరంగా మాత్రం పాత ఫార్ములానే కొనసాగించాడు.

ఇంతకీ ఈ భగత్​సింగ్​ కథేంటంటే?

పోలీస్ గెటప్‌లో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ లుక్ – ఉస్తాద్ భగత్ సింగ్ హైలైట్ సీన్.. గబ్బర్​సింగ్​లా కాకుండా.. సీరియస్​ టోన్​

నల్లమల్ల అడవుల్లోని ఓ గూడెంలో అనాథగా పెరిగిన చిన్నయ్యను గురువు చంద్రశేఖర్ రావు (కే.ఎస్. రవికుమార్) దత్తత తీసుకుని చదివిస్తాడు. అతనిలోని ధైర్యం, న్యాయం పట్ల ఉన్న ఆవేశాన్ని గుర్తించి ‘ఉస్తాద్ భగత్ సింగ్’గా తీర్చిదిద్దుతాడు. కాలక్రమేణా అతడు ఒక ధైర్యవంతమైన ఏసీపీగా మారి, డ్రగ్స్ మాఫియా, రాజకీయ అవినీతి, సామాజిక అన్యాయాలపై పోరాటం ప్రారంభిస్తాడు. చట్టాన్ని అతిక్రమించే వారిని కఠినంగా శిక్షించడం అతని విధానం.

ఇక మరోవైపు, అతని గురువు రాజకీయాల్లోకి ప్రవేశించి ముఖ్యమంత్రిగా ఎదుగుతాడు. రాష్ట్రంలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఈ మార్పులను అడ్డుకునేందుకు అవినీతి రాజకీయ నాయకుడు నల్ల నాగప్ప (పార్థిబన్) కుట్రలు పన్నడం మొదలుపెడతాడు. ముఖ్యమంత్రిపై దాడి చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి. ఈ కుట్ర వెనుక ఉన్న నల్ల నాగప్ప నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ఉస్తాద్ రంగంలోకి దిగుతాడు. డ్రగ్స్, రాజకీయ కుట్రలు, నేర ప్రపంచంతో అతని పోరాటం కథలో ప్రధానాంశంగా మారుతుంది.

ఇదే సమయంలో రేడియో జాకీ లీల (శ్రీలీల)తో అతనికి ఏర్పడే అనుబంధం, శ్లోక (రాశీ ఖన్నా)తో ఉన్న సంబంధం కథకు వ్యక్తిగత కోణాన్ని ఇస్తాయి.

చివరికి, నల్ల నాగప్ప కుట్రలను ఉస్తాద్ ఎలా ఎదుర్కొన్నాడు? తన గురువును, రాష్ట్రాన్ని ఎలా రక్షించాడు? అన్నదే కథ క్లైమాక్స్.

ఎవరెవరు ఎలా? పవర్​ పాక్డ్​ పవన్​..

అడవిలో శ్రీలీలతో కలిసి నడుస్తూ కనిపించిన పవన్ కళ్యాణ్ – ‘తొలిప్రేమ’ సీన్​లా ఉంది కదా..

పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ. తన స్టైల్, డైలాగ్ డెలివరీ, యాక్షన్‌తో సినిమా మొత్తాన్ని మోస్తాడు. కొన్ని చోట్ల ‘వింటేజ్ పవన్’ కనిపించడం అభిమానులకు కిక్ ఇస్తుంది.

శ్రీలీల ఎనర్జీతో కనిపించినా, పాత్ర పరంగా పెద్దగా ప్రాముఖ్యత కనబడలేదు. రాశీ ఖన్నా పాత్ర పరిమితంగా ఉండటం మైనస్. విలన్‌గా పార్థిబన్ తన పాత్రను బాగా పోషించినా, క్యారెక్టర్ బలహీనంగా ఉంది.

సంగీతం సరిపోయిందా? ఇతర సాంకేతిక అంశాలు..

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఆశించిన స్థాయిలో లేదు. థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సాధారణంగా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ మాత్రం బాగుంది. అడవి అందాలు అద్భుతంగా కెమెరాలో బంధించారు. ఎడిటింగ్‌లో మరింత పదును ఉంటే సినిమా బెటర్ అయ్యేది.

దర్శకుడు హరీష్ శంకర్ మాస్ ఎలిమెంట్స్‌ను బాగా హ్యాండిల్ చేసినా, కథలో కొత్తదనం తీసుకురావడంలో విఫలమయ్యాడు. అయితే, ‘భగత్‌సింగ్’లో దర్శకుడు హరీష్ శంకర్ ప్రయోగాల జోలికి వెళ్లకుండా, పవన్ కళ్యాణ్ స్వాగ్‌పైనే సినిమా నడిపించాడు. విషయంలో మాత్రం సఫలీకృతుడయ్యాడనే చెప్పాలి. ఒక రకంగా చూస్తే, మన శివశంకర వరప్రసాద్ గారు, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రెండూ ఒకే ట్రెండ్‌ను అనుసరించినట్టు కనిపిస్తాయి – లాజిక్ కంటే స్వాగ్‌కే ప్రాధాన్య ఇచ్చారు.

🔸 బలాలు

🔸 బలహీనతలు

🔸 చివరి మాట

మొత్తంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒక రొటీన్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది మాంచి కిక్కిచ్చే  సినిమా. కానీ సాధారణ ప్రేక్షకులకు మాత్రం ఇది ఒక రొటీన్​ అనుభవమే.

విధాత రేటింగ్​ : 2.75/5

Latest News