విధాత: ఈ సంక్రాంతి పర్వదినానికి థియేటర్లోకి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) అన్ని చోట్లా సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళుతూ రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే రిలీజైన గేమ్ ఛేంజర్, డాకు మహరాజ్ చిత్రాలను కాదని ప్రతి షో హౌస్‌ఫు్ కలెక్షన్లతో తెలుగు నాట ఓ కొత్త చరిత్రను నెలకొల్పుతోంది.
ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడంతో పాటు సినిమా చూసి మరి తన అభిప్రాయం చెప్పిన సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu)ను శుక్రవారం సంక్రాంతికి వస్తున్నాం సినిమా యూనిట్ కలిసింది.
కార్యక్రమంలో విక్టరీ వెంకటేశ్ (Venkatesh), ఐశ్వర్య రాజేశ్ (aishwarya rajesh), మీనాక్షి చౌదరి (Meenakshii Chaudhary), అనీల్ రావిపూడి, నమ్రత, మెహర్ రమేశ్, సురేశ్ బాబు, వంశీ పైడిపల్లి , దిల్ రాజు పాల్లొని కాసేపు సందడి చేశారు.
ఈ సందర్భంగా దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. వీటిని చూసిన వారంతా చిన్నోడు పెద్దోడు మరోసారి కలిశారంటూ కామెంట్లు చేస్తున్నారు. మీరూ ఓ లుక్కేయండి.