కోవిడ్ పేషంట్లకు ఆక్సిజన్ ఎంత అవసరమో తెలుసా .. ?

విధాత :మనం పీల్చే గాలిలో 21% ఆక్సిజన్ 78%నత్రజని ఉంటాయి. కోవిడ్ పేషెంట్ కు ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ వలన, 21 శాతం బదులు 99% ఆక్సిజన్ కావలసి వస్తోంది. దీనికి వాతావరణం లో ఉన్నటువంటి 21 శాతం ఆక్సిజన్ను కంప్రెషన్ మరియు డిస్టిలేషన్ పద్ధతి ద్వారా 99.5% వరకు పెంచి లిక్విడ్ ఆక్సిజన్ గా లేదా వాయువు ఆక్సిజన్ గా కోవిద్ పేషెంట్లకు వాడుతూ ఉంటారు. కోవిడ్ పేషెంట్లకు ఇచ్చే ఆక్సిజన్ సరఫరా విషయంలో ప్రభుత్వము అనేక […]

  • Publish Date - May 17, 2021 / 03:42 AM IST

విధాత :మనం పీల్చే గాలిలో 21% ఆక్సిజన్ 78%నత్రజని ఉంటాయి. కోవిడ్ పేషెంట్ కు ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ వలన, 21 శాతం బదులు 99% ఆక్సిజన్ కావలసి వస్తోంది. దీనికి వాతావరణం లో ఉన్నటువంటి 21 శాతం ఆక్సిజన్ను కంప్రెషన్ మరియు డిస్టిలేషన్ పద్ధతి ద్వారా 99.5% వరకు పెంచి లిక్విడ్ ఆక్సిజన్ గా లేదా వాయువు ఆక్సిజన్ గా కోవిద్ పేషెంట్లకు వాడుతూ ఉంటారు.

కోవిడ్ పేషెంట్లకు ఇచ్చే ఆక్సిజన్ సరఫరా విషయంలో ప్రభుత్వము అనేక చర్యలు తీసుకుంటోంది.

  1. గాలిలో ఉన్న ఆక్సిజన్ ను స్టీల్ ప్లాంట్ లో/రిఫైనరీలో/ ఆక్సి జనరేషన్ ప్లాంట్లో , కంప్రెషన్ మరియు డిస్టిలేషన్ పద్ధతి ద్వారా మైనస్ 180 డిగ్రీల దగ్గర ద్రవరూపంలోకి మార్చి వాడుతూ ఉంటారు.
  2. ఇలాంటి ద్రవ ఆక్సిజన్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ట్యాంకర్ల ద్వారా జామ్ నగర్ గుజరాత్, పశ్చిమబెంగాల్లోని దుర్గాపూర్ , జార్ఖండ్లోని జంషెడ్పూర్, ఒరిస్సాలోని అంగూల్ మొదలైన ప్రాంతాల నుంచి ప్రత్యేక రైల్ లేదా రోడ్డు ట్యాంకర్ల ద్వారా తీసుకురావడం జరుగుతుంది.
  3. ప్రస్తుతం ఐ ఎస్ ఓ కంటైనర్లను ఎక్కువగా వాడుతున్నారు. ప్రతి కంటైనర్ 20 టన్నుల సామర్థ్యం ఉంటుంది. ప్రతి ట్రైన్లో 8 కంటైనర్ ట్యాంకులను లోడ్ చేస్తారు. ఇలా తీసుకు వచ్చినటువంటి ద్రవ ఆక్సిజన్ను ఒక కంటైనర్ డిపోలో చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది.

రమారమి 1500 నుండి 2200 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చినటువంటి ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కంటైనర్ డిపోలో కి వచ్చిన తర్వాత అనేక జాగ్రత్తలు మధ్య రోడ్డు Tanker లోనికి నింపి ఆసుపత్రులకు పంపడం జరుగుతుంది.

కంటైనర్ డిపోలో తీసుకున్నటువంటి జాగ్రత్తలు

  1. . వచ్చిన ట్యాంకర్ లను 30 టన్నుల staker / క్రేన్ ద్వారా ట్రైలర్లో కి దింపుతారు
  2. స్పెషల్ గా ట్రైన్ అయినటువంటి టెక్నీషియన్స్ ఈ ట్యాంకర్ల నుండి hosepipe ద్వారా రోడ్డు ట్యాంకర్ లోకి ప్రెషర్ మెయింటెన్ చేస్తూ ట్రాన్స్ఫర్ చేస్తారు. ప్రతి రోడ్డు కంటైనర్ 10 నుంచి 20 టన్నుల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఫైర్ టెండర్లు, సిబ్బంది, పోలీస్ సిబ్బంది, క్రేన్ సిబ్బంది, ట్రైలర్ సిబ్బంది అందరూ కలిసి ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు.
  3. రోడ్డు tanker లో లోడ్ అయిన పిదప పోలీస్ ఎస్కార్ట్ తో ప్లాన్ చేసినటువంటి ఆస్పత్రికి తరలిస్తారు. ఆసుపత్రిలో జాగ్రత్తలు
  4. ఇలా వచ్చినటువంటి ద్రవ ఆక్సిజన్ను ఆస్పత్రి లో ఉన్నటువంటి 10 టన్నుల సామర్థ్యం కలిగిన ట్యాంక్ లోనికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నింపుతారు.
  5. ఈ ట్యాంక్ నుండి ప్రత్యేక పైప్లైన్ ద్వారా కోవిడ్ పేషెంట్లను ట్రీట్ చేసే బెడ్ వరకు ఆక్సిజన్ సరఫరా నెలకొల్పుతారు. అలాగే ఐసియు లో ఉన్నటువంటి వెంటిలేటర్ బెడ్ కూడా సరఫరా అందిస్తారు.
  6. ఇది కాకుండా ఆక్సిజన్ గ్యాస్ సిలిండర్ల ద్వారా మరియు ఆక్సిజన్ కాన్సెంట్రేట్ ల ద్వారా కూడా కో విడ్ పేషెంట్లకు ప్రాణ వాయువు అందిస్తూ ఉంటారు..

ఎక్కడో గుజరాత్లోని జామ్ నగర్లో లేదా పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్ లో, జార్ఖండ్లోని జంషెడ్ పూర్ లో, ఒడిస్సా లోని ఆంగూల్ లో ఉత్పత్తి అయినటువంటి ప్రాణవాయువు కర్నూల్ లోని పేషెంట్ కి ఇవ్వవలసి వస్తుంది.

దానికి ప్రభుత్వ సిబ్బంది , రైల్వే సిబ్బంది, ట్యాంకర్లను తీసుకుని వచ్చే డ్రైవర్లు, ఆస్పత్రిలో సిబ్బంది ఇలా అనేక మంది కరోనా పేషెంట్ ఆరోగ్య విషయంలో రేయింబవళ్ళు కష్ట పడాల్సి వస్తోంది..

ఎంతో కష్టంతో, ఖర్చుతో ఎక్కడ ఎక్కడ నుం డో తీసుకుని వస్తున్నటువంటి ఈ ప్రాణవాయువును చాలా పొదుపుగా వాడాల్సి ఉంటుంది

ఎంత ఆదా చేస్తే అంత ఉత్పత్తి చేసినట్లు అంత మందికి ప్రాణవాయువు అందించినట్లు!!

మనం చాలా జాగ్రత్తగా ఉంటూ ఇంట్లో ఉన్నట్లయితే రేయింబవళ్ళు కష్టపడుతున్న టువంటి వీళ్ళందరికీ ఎంతో సహాయం చేసిన వాళ్లం అవుతాము.