ఆక్సీజన్ ఆడిట్ కోసం జిల్లాకు చేరుకున్న తూర్పు నావికా సాంకేతిక బృందం

విధాత:భారత నావికా దళం యొక్క తూర్పు నావికా సాంకేతిక బృందం కృష్ణా,గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఆక్సీజన్ ఆడిట్ నిర్వహణ కోసం మంగళవారం విజయవాడకు చేరుకుంది. ఈ బృందానికి జిల్లా కోవిడ్ నోడల్ అధికారి,జెసి ఎల్.శివశంకర్ స్వాగతం పలికారు. అనంతరం బృందం విజయవాడ జిజిహెచ్ లో 20 టన్నులు,10 టన్నుల ఆక్సీజన్ ప్లాంట్ లను పరిశీలించారు.తదుపరి జెసి క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ, బోధన ఆస్పత్రులకు అవసరమైన ఆక్సీజన్ డిమాండ్,అంచనా,సరఫరా, వినియోగంలపై ఆడిట్ నిర్వహించడం కోసం […]

  • Publish Date - May 19, 2021 / 01:17 AM IST

విధాత:భారత నావికా దళం యొక్క తూర్పు నావికా సాంకేతిక బృందం కృష్ణా,గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఆక్సీజన్ ఆడిట్ నిర్వహణ కోసం మంగళవారం విజయవాడకు చేరుకుంది.

ఈ బృందానికి జిల్లా కోవిడ్ నోడల్ అధికారి,జెసి ఎల్.శివశంకర్ స్వాగతం పలికారు. అనంతరం బృందం విజయవాడ జిజిహెచ్ లో 20 టన్నులు,10 టన్నుల ఆక్సీజన్ ప్లాంట్ లను పరిశీలించారు.తదుపరి జెసి క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ, బోధన ఆస్పత్రులకు అవసరమైన ఆక్సీజన్ డిమాండ్,అంచనా,సరఫరా, వినియోగంలపై ఆడిట్ నిర్వహించడం కోసం నియమించిన బృందానికి జిల్లాలో ఆక్సీజన్ సరఫరా,డిమాండ్ ,వినియోగం తదితర అంశాలను జెసి శివశంకర్ వివరించారు.

జిజిహెచ్ లో ఆక్సీజన్ సరఫరా తీరు,పైప్ లైన్స్ నిర్వహణ, రోగులకు ఆక్సీజన్ చేర్చే సమయంలో ఆక్సీజన్ వృధా కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై బృందం జెసి తో సమీక్షించారు.ఆక్సీజన్ సరఫరా,అవస్థాపన ,పైప్ లైన్లు మరియు ఇతర పరికరాలను ఈ బృందం తనిఖీ చేసిన పిమ్మట వారి సూచనలు మేరకు ఏదైనా ఉంటే దిద్దుబాటు చర్యలు తీసుకోవటం జరుగుతుంది.