Site icon vidhaatha

Falcon Scam: ఫాల్కన్ స్కామ్‌.. అమ‌ర్‌దీప్‌ చార్టర్ ఫ్లైట్ సీజ్!

Falcon Scam:

విధాత: ఫాల్కన్ స్కామ్ కేసు (Falcon Scam Case)లో కీలక పరిణామం (Big Twist) చోటు చేసుకుంది. ఫాల్కన్ సంస్థకు చెందిన చార్టర్ ఫ్లైట్ (Charter flight) ను ఈడీ (ED) సీజ్ చేసింది (Seized). దుబాయ్ నుంచి హైదారాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు (Hyderabad Shamshabad Airport)కు చేరిన ఫాల్కన్ సంస్థ చార్టర్ ఫ్లైట్ ను చుట్టుముట్టిన ఈడీ, కస్టమ్స్ బృందాలు అందులో ఉన్నఇద్దరు నిందితులు పవన్, కావ్యను అదుపులోకి తీసుకుని ఫ్లైట్ ను సీజ్ చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండైన చార్టర్డ్ ఫ్లైట్ కొనుగోలుపై విచారణ చేపట్టారు. మెడికల్ ఎమర్జెన్సీ పేరుతో ఎయిర్ పోర్ట్ లో లాండింగ్ పర్మిషన్ కోరిన ఫాల్కన్ ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత మెడికల్ ఎమర్జెన్సీ లేకపోవడంతో ఈడీ అధికారులకు సమాచారమిచ్చారు.12 గంటల పాటు కొనసాగిన హైడ్రామా మధ్య ఫ్లైట్ ని టేకోవర్ చేసుకున్నారు. ఈడీ అధికారులు పైలెట్, కోపైలెట్ లను విచారిస్తున్నారు.

రూ.1700కోట్ల మోసం!

హైదబారాబాద్ కేంద్రంగా ఇన్వాయిస్ డిస్కౌంట్ పేరుతో అధిక లాభాలు ఆశచూపి రూ.1700కోట్ల మోసానికి ఫాల్కన్ కంపనీ పాల్పడిన కేసును సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) పోలీసులు ఇటీవలే ఈడీకి అప్పగించారు. దాదాపు 7వేల మంది బాధితులను ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ ప్రవైటు లిమిటెడ్ కంపనీ మోసం చేసినట్లుగా గుర్తించారు. 19మందిపై కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు ఫాల్కన్ ఎండీ అమర్ దీప్ కుమార్, చీప్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆర్యన్ సింగ్, సీఈవో యోగేంద్ర సింగ్ లు దుబాయ్ పారిపోయారు. వారికి లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. పవన్ కుమార్ ఓదెల, కావ్య నల్లూరి, అనంత్ లను పోలీసులు అరెస్టు చేశారు. మోసం చేసి కొల్లగొట్టిన రూ.1700కోట్లతో రూ.850కోట్లు డిపాజిట్ దారులకు రిటర్న్ చేయగా..మిగిలిన రూ.850కోట్ల డబ్బును నిందితులు విదేశాల్లోని షెల్ కంపెనీలకు తరలించినట్లుగా గుర్తించారు.

ప్రెస్టేజ్ జెట్స్ పేరుతో ఫ్లైట్ కొనుగోలు

ఫాల్కన్ కంపనీ ఎండీ అమర్ దీప్ కుమార్ పెట్టుబడిదారులను మోసం చేసి కొల్లగొట్టిన డబ్బులలో 1.6 మిలియన్ పౌండ్లు చెల్లించి ప్రెస్టేజ్ జెట్స్ కంపెనీ పేరుతో 12సీట్ల చార్టర్ ఫ్లైట్ కొన్నాడు. జనవరి 22న చార్టర్డ్ ఫ్లైట్ లో అమర్, వివేక్ సేతుతు విదేశాలకు పరారయ్యారు. అమర్ దీప్ విదేశాల్లో ఎంజాయ్ చేసేందుకు చార్టర్డ్ ఫ్లైట్ కొన్నట్లుగా విచారణాధికారులు గుర్తించారు.

Exit mobile version