Site icon vidhaatha

China | మా దేశానికి రండి.. ఈజీగా వీసాలు, స‌దుపాయాలు! భార‌త్‌కు చైనా ఆఫ‌ర్ల మీద ఆప‌ర్లు

తొమ్మిది రోజుల్లో భారతీయులకు 85వేల వీసాల జారీ

విధాత: అమెరికా సుంకాల పెంపు వివాదం కాస్తా భారత్, చైనాల మధ్య సంబంధాల వృద్ధికి బాటలు వేస్తుంది. భార‌తీయ పౌరుల‌కు చైనా కేవలం తొమ్మిది రోజుల్లోనే 85 వేల వీసాల‌(China Visas)ను జారీ చేసింది. భార‌త్‌లో ఉన్న చైనా ఎంబ‌సీ ఈ విషయమై కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి ఏప్రిల్ 9వ తేదీ వ‌ర‌కు ఈ వీసాలను జారీ చేసినట్లుగా వెల్లడించింది.

చైనీస్ అంబాసిడ‌ర్ జూ ఫీహంగ్ దీనిపై మాట్లాడుతూ.. చైనాకు ట్రావెల్ చేస్తున్న 85 వేల ఇండియ‌న్ల‌కు వీసాలు ఇచ్చిన‌ట్లు తెలిపారు. చైనాకు విజిట్ చేయాల‌ని ఎక్కువ మంది భార‌తీయ మిత్రులను కోరుతున్న‌ట్లు వెల్ల‌డించారు. భార‌త్‌, చైనా మ‌ధ్య‌ ట్రావెల్‌ను ఈజీ చేసేందుకు అనేక స‌దుపాయాలు క‌ల్పించిన‌ట్లు చైనీస్ ప్ర‌భుత్వం చెప్పింది.

వీసాల కోసం ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ అవ‌స‌రం లేద‌ని చైనీస్ అధికారులు చెప్పారు. వీసా సెంట‌ర్ల వ‌ద్ద నేరుగా వెళ్లి వీసా ద‌ర‌ఖాస్తుల‌ను అంద‌జేయ‌వ‌చ్చు. చాలా త‌క్కువ టైం కోసం చైనా వెళ్లే వారు బ‌యోమెట్రిక్ డేటాను స‌మ‌ర్పించాల్సిన అవ‌స‌రం కూడా లేదని తెలిపింది. చాలా త‌క్కువ ధ‌ర‌కే చైనా వీసాను అందిస్తున్న‌ట్లు చెప్పారు. ఇండియ‌న్ విజిట‌ర్స్‌కు చాలా త‌క్కువకే ట్రావెల్ స‌దుపాయాలు క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపారు.

వీసా అప్రూవ‌ల్ టైంలైన్ కూడా త‌గ్గించారు. వీలైనంత త్వ‌ర‌గా వీసాల‌ను జారీ చేస్తున్నారు. భార‌తీయ టూరిస్టుల‌ను యాక్టివ్‌గా ప్ర‌మోట్ చేస్తున్న‌ట్లు చైనా టూరిజం శాఖ తెలిపింది. డిస్టినేష‌న్‌, ఫెస్టివ‌ల్స్ స‌మ‌యంలో ఎక్కువ ప్రోత్స‌హిస్తున్న‌ట్లు చెప్పారు. తాజా పరిణామాలు భారత్, చైనాల మ‌ధ్య దృఢ‌మైన బంధం ఏర్ప‌డుతుంద‌న్న దానికి ఇది సంకేతంగా నిలుస్తున్న‌ది.

Exit mobile version