Site icon vidhaatha

రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు

విధాత:రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఎస్. స్టెల్లా తెలిపారు. ఈనెల 23న వాయువ్య బంగాళాఖాతంలో అల్ప పీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందన్నారు.దీంతో రాష్ట్రంలో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఉత్తర కోస్తాంధ్ర, యానాం

ఈరోజు, రేపు చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి.ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆంధ్రా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటరు వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందన్నారు.

దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ

ఈరోజు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి.ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Exit mobile version