చరిత్రలో మైలు రాయిగా మేడారం ప్రాంగణ పునరుద్ధరణ : సీతక్క

జనవరి 18న సీఎం రేవంత్ రెడ్డి మేడారం పర్యటన. రూ. 251 కోట్లతో పునరుద్ధరించిన గద్దెల ప్రాంగణాన్ని 19న ప్రారంభించనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు.

Medaram Jatara

విధాత, ప్రత్యేక ప్రతినిధి: గిరిజన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ప్రతిబింబించేలా వనదేవతల గద్దెల ప్రాంగణ పునరుద్ధరణ సాగుతున్నదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క చెప్పారు. ప్రపంచానికి ఆదివాసులు మూలవాసులుగా ఉన్నారని గుర్తు చేశారు. వన దేవతల ఘన కీర్తి ప్రపంచానికి చాటిచెప్పే విధంగా మేడారం జాతర నిర్వహిస్తామని ఆమె తెలిపారు.
మేడారం అభివృద్ధి పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని వివరించారు.

శుక్రవారం మేడారం హరిత హోటల్ లో మంత్రి సీతక్క,జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.,ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్, లతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.

రూ.251 కోట్లతో అభివృద్ధి

తెలంగాణ ప్రభుత్వం రూ. 251 కోట్ల నిధులతో చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో మేడారం జాతర నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. జాతరలో శాశ్వత ప్రతిపాదికన అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.

మాఘశుద్ధ పౌర్ణమి వెలుగులో గిరిజన సంస్కృతి, సంప్రదాయాల డోలు వాయిద్యాల నడుమ జిల్లా అధికారుల గౌరవ వందనంతో గిరిజన నృత్యాలతో వన దేవతలు గద్దెల పైకి వచ్చినపుడు భక్త జనం భక్తి పారవశ్యంతో పులకరిస్తారని అన్నారు. ఈ మహాద్భుత ఘట్టం ఆవిష్కృతం కోసం కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారని తెలిపారు.
గద్దెల పునరుద్ధరన ముఖ్యమంత్రి చేతుల మీదుగా 19వ తేదీ ఉదయం 7 గంటలకు ప్రారంభిస్తామన్నారు. 18వ తేదీ సాయంత్రం ముఖ్యమంత్రి మేడారం చేరుకుంటారని, గద్దెల పునరుద్ధరణ ప్రారంభ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

ఆలయ పునరుద్ధన విషయంలో గిరిజన పెద్దలతో, పూజారులతో, ఆదివాసి సంఘాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశామని , అందరి సమ్మతి, సంతకాలతో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు.

జాతరలో మహిళా సంఘాల సభ్యులకు ప్రాధాన్యత ఇస్తూ వారికి బొంగు చికెన్, ఇప్ప పువ్వు లడ్డు ప్రత్యేక దుకాణాలు పెట్టించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ రామ్నాథ్ కేతన్, మహేందర్ జి ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

Children Health | మీ పిల్లలు ఫోన్‌ ఎక్కువగా చూస్తున్నారా..? అయితే వారి గుండె ప్రమాదంలో పడినట్టే..
Donald Trump | గ్రీన్‌లాండ్‌పై ట్రంప్‌ కొత్త వ్యూహం.. పౌరులకు డబ్బు ఆఫర్‌..?

Latest News