దీని ఎత్తు 829.8 మీటర్లు (2,717 అడుగులు). 163 అంతస్తుల ఈ భవన నిర్మాణాన్ని 2004లో ప్రారంభించారు. దీని నిర్మాణం పూర్తి కావడానికి దాదాపు ఆరేండ్లు పట్టింది. 2010లో పబ్లిక్ కోసం ఓపెన్ చేశారు. ఇందులో విలాసవంతమైన హోటళ్లు, హై ఎండ్ అపార్ట్‌మెంట్లు, కార్పొరేట్ కార్యాలయాలు ఉన్నాయి. ఈ భవనం పారిస్‌లోని ఐఫిల్ టవర్ కంటే మూడు రెట్లు ఎత్తుగా ఉంటుంది. ఎంపైర్ స్టేట్ భవనం ఎత్తుకు దాదాపు రెట్టింపు ఉంటుంది. పేరుకు తగ్గట్టే ఈ భవనం రిచ్‌నెస్‌కు కేరాఫ్ అడ్రెస్. ఇందులో సింగిల్ బెడ్ రూమ్ అద్దే నెలకు రూ.లక్షల్లో ఉంటుందని సమాచారం.
బుర్జ్ ఖలీఫా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంటుంది. అయితే, ఈ ఎత్తైన భవనం ఎవరిది..? అన్న విషయం ఎవరికీ తెలియదు. ఇది దుబాయ్ రాజులది మాత్రం కాదు. ఇంతకీ మీకు తెలుసా.. ఈ భవనం ఓనర్ ఎవరన్నది..? అయితే, ఇప్పుడు తెలుసుకుందాం రండి. దుబాయ్‌కి చెందిన రియల్ ఎస్టేట్ డెవలపర్ ఎమ్మార్ ప్రాపర్టీస్ (Emaar Properties) ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాను నిర్మించింది. ఈ కంపెనీని 1997లో ఎమిరాటీ వ్యాపారవేత్త మొహమ్మద్ అలబ్బర్ (Mohamed Alabbar) స్థాపించారు. ఈయనే బుర్జ్ ఖలీఫా అసలైన యజమాని.
ఎమ్మార్ ప్రాపర్టీస్ బుర్జ్ ఖలీఫాను మాత్రమే కాకుండా.. దుబాయ్ మాల్, దుబాయ్ క్రీక్ టవర్, దుబాయ్ ఫౌంటెన్ వంటి ఇతర ఐకానిక్ ప్రాజెక్టులను కూడా అభివృద్ధి చేసింది. అవన్నీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచాయి. ఫోర్బ్స్ ప్రకారం, మొహమ్మద్ అలబ్బర్.. రియాద్‌కు చెందిన ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ నూన్.కామ్, దుబాయ్‌కు చెందిన డిజిటల్ బ్యాంక్ జాండ్ బ్యాంక్‌లో వాటాలు ఉన్నాయి. అతని నికర విలువ 2.3 బిలియన్ డాలర్లు. ప్రపంచ బిలియనీర్ల జాబితా 2025లో అలబ్బర్ 1,573 ర్యాంక్‌ను దక్కించుకున్నారు.
ఇవి కూడా చదవండి..
మీ పిల్లలు ఫోన్ ఎక్కువగా చూస్తున్నారా..? అయితే వారి గుండె ప్రమాదంలో పడినట్టే..
చలిగా ఉందని నీళ్లు తక్కువ తాగితే.. మూత్రపిండాలకు ముప్పే..!
AQI అంటే ఏమిటి? గాలి ఎంత ప్రమాదకరం?
