HYDRAA
విధాత: హైదరాబాద్ చాంద్రాయణ గుట్టలోని అక్బర్ నగర్‌లో షాపులను హైడ్రా కూల్చివేసింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా అధికారులు కూల్చివేతలు నిర్వహించారు. కూల్చివేతలకు ఎంఐఎం కార్పొరేటర్లు, స్థానికులతో కలిసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, పాతబస్తీ వాసులకు మధ్య తోపులాట సాగింది. స్థానికులు హైడ్రా జేసీబీ ఎక్కి, జేసీబీ ముందు పడుకొని కూల్చివేతలను అడ్డుపడ్డారు.
హైడ్రాకు, చైర్మన్ రంగనాథ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కూల్చివేతలకు అడ్డుపడిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెవెన్యూ రికార్డులు చూడకుండా కోర్టు వ్యాజ్యాలు పట్టించుకోకుండా దౌర్జన్యంగా కూల్చివేతలు చేపట్టారని ఎంఐఎం కార్పేరేటర్లు ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డిని హైడ్రా బద్నామ్ చేస్తుందని ఆయన క్షేత్ర స్థాయిలో వాస్తవాలు తెలుసుకోవాలన్నారు.