Site icon vidhaatha

విశ్రాంత ఐఏఎస్‌కు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ

విధాత,అమరావతి: రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఉదయలక్ష్మికి ఏపీ హైకోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. పీఈటీ అధ్యాపకుడి అంశంలో కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేయడంతో వారెంట్‌ జారీ అయింది. తనకు అన్యాయం చేశారని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన రత్నకుమార్‌ అనే పీఈటీ ఉపాధ్యాయుడు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో రత్నకుమార్‌కు న్యాయం చేయాలని హైకోర్టు ఆదేశించింది.

గతంలో ఉన్నతవిద్యాశాఖ కమిషనర్‌గా పనిచేసిన ఉదయలక్ష్మి.. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను పట్టించుకోకపోవడం కోర్టు ధిక్కరణగా న్యాయస్థానం పరిగణించింది. వచ్చే విచారణలో ఉదయలక్ష్మిని హాజరుపరచాలని గుంటూరు ఎస్పీని హైకోర్టు ఆదేశించింది. దీనిపై కౌంటరు దాఖలు చేయాలని గతంలో విద్యాశాఖలో పనిచేసిన ఆదిత్యనాథ్‌ దాస్‌ను న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలపాటు వాయిదా వేసింది

Exit mobile version