Site icon vidhaatha

OTT: స‌డ‌న్‌గా తెలుగులో ఓటీటీకి వ‌చ్చేసిన.. క‌న్న‌డ బ్లాక్‌బ‌స్ట‌ర్‌!డోంట్‌మిస్‌.. ఎందులో అంటే

విధాత‌: క‌న్న‌డ సూప‌ర్ స్టార్ శివ‌రాజ్‌కుమార్ (Shiva Rajkumar) హీరోగా గత సంవ‌త్స‌రం దీపావ‌ళికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మంచి విజ‌యం సాధించిన చిత్రం భైర‌తి ర‌ణ‌గ‌ల్ (Bhairathi Ranagal). రుక్మిణీ వ‌సంత్ (Rukmini Vasanth) క‌థానాయిక‌గా.. బాలీవుడ్ న‌టుడు రాహుల్ బోస్ (Rahul Bose) కీలక పాత్ర‌లో న‌టించారు. పాన్ ఇండియాగా రిలీజైన ఈ మూవీ అన్ని చోట్లా మిశ్ర‌మ స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంది. గ‌తంలో వ‌చ్చిన బ్లాక్‌బ‌స్ట‌ర్ ముప్తీ ఫ్రీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాను స్వ‌యానా శివ రాజ్ కుమార్ భార్య గీత నిర్మించ‌గా న‌ర్త‌న్ (Narthan) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. నెల‌న్న‌ర క్రితమే క్రిస్మ‌స్ నుంచి తెలుగు మిన‌హ అన్ని భాష‌ల్లో డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన ఈ చిత్రం ఎట్ట‌కేల‌కు తెలుగులోనూ స్ట్రీమింగ్‌కు వ‌చ్చింది. అయితే ఈ సినిమా ఇటీవ‌ల సంక్రాంతికి థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన బాల‌కృష్ణ‌ డాకూ మ‌హారాజ్ క‌థ‌ను పోలి ఉండం గ‌మ‌నార్హం.

క‌థ విష‌యానికి వ‌స్తే.. రోనాపురం అనే గ్రామం తీవ్ర నీట స‌మ‌స్య‌తో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. అక్క‌డి ప్ర‌జ‌లు ప్ర‌భుత్వానికి ఎన్ని అర్జీలు ఇచ్చినా ఫ‌లితం క‌నిపించ‌క‌పోవ‌డంతో భైర‌తి అనే కుర్రాడు ఆగ్ర‌హంతో ఓ ప్ర‌భుత్వ ఆఫీస్‌లో బాంబు పెడ‌తాడు. ఆ నేరంలో జైలుకు వెళ్లిన కుర్రాడు అక్క‌డే చ‌దువుకుని 20 ఏండ్ల త‌ర్వాత‌ అడ్వ‌కేట్ అయి బ‌య‌ట‌కు వ‌స్తాడు. త‌న సొంత ఐరికి వెళ్లిన భైర‌తికి అక్క‌డ మైనింగ్ స‌మ‌స్య అధికంగా ఉండి కార్మికులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని, వాళ్ల భూములు సైతం స‌ద‌రు యాజ‌మాన్యం బ‌ల‌వంతంగా తీసుకుంద‌ని తెలుస్తుంది. ఈ క్ర‌మంలో ఓ కార్మిక నేత సాయంతో కంపెనీతో లీగ‌ల్ పోరాటం చేస్తుంటాడు.

అయినా స‌మ‌స్య ప‌రిష్కారం కాక పోగా కొత్త స‌మ‌స్య‌లు రావ‌డంతో భైర‌తి త‌న ప‌ద్ద‌తి మార్చి గ్యాంగ్‌స్టార్‌గా మారాల్సి వ‌స్తుంది. ఈ నేప‌థ్యంలో భైబ‌ర‌తి వ్యాపార‌వేత్త‌తో ప‌రండేతో ఎలా ఢీ కొన్నాడు, ఎలాంటి పరిస్థితులు ఎదుర‌య్యాయ‌నే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది. అలాగే కొన్ని గైలాగ్స్ సైతం, ర‌వి బ‌స్రూర్ సంగీతం ఓ రేంజ్‌లో ఉండి హీరో క్యారెక్ట‌ర్‌ను ఓ స్థాయిలో ఎలివేట్ చేస్తాయి.

ఫ‌స్టాఫ్ అంతా స్లో అండ్ స్ట‌డీగా సాగే సినిమా ఇంట‌ర్వెల్ బ్యాంగ్ త‌ర్వాత కొత్త ట‌ర్న్ తీసుకుని స‌గ‌టు ప్రేక్ష‌కుడికి కావాల్సిన హై ఇస్తుంది. హీరో, విల‌న్‌ల మ‌ధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్‌లా సాగుతుంది. ఇప్పుడీ సినిమా అహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. థియేట‌ర్ల‌లో మిస్స‌యిన వారు, మంచి యాక్ష‌న్ సినిమా చూడాల‌నుకునేవారు ఈ భైర‌తి ర‌ణ‌గ‌ల్ (Bhairathi Ranagal) సినిమాను ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ‌కండి.

Exit mobile version