విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) ఎర్రవల్లిలోని(Erravalli) తన ఫామ్‌హౌస్‌లో(Farmhouse) పార్టీ కీలక నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సహా మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు హాజరయ్యారు. బీఆర్ఎస్ నుంచి కవిత(Kavitha) సస్పెండ్ అనంతరం ఆమె ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు..వాటి ప్రభావంతో పాటు కాళేశ్వరంపై సీబీఐ విచారణ అంశాలపై వారు చర్చించారు.
మూడు రోజులుగా ఫామ్ హౌస్ లో కేసీఆర్ తాజా రాజకీయాలపై పార్టీ ముఖ్య నేతలలో సుధీర్ఘ భేటీలు కొనసాగిస్తుండటం విశేషం. ముఖ్యంగా కాళేశ్వరం(Kaleshwaram) కమిషన్, సీబీఐ(CBI) విచారన సమయంలోనే కవిత(Kavitha) ఎపిసోడ్ చోటుచేసుకోవడంతో పార్టీపై వాటి ప్రతికూలతను ఎలా అధిగమించాలన్నదానిపై ఈ సమావేశాల్లో కేసీఆర్ ప్రధానంగా దృష్టి పెట్టినట్లుగా సమాచారం.