Site icon vidhaatha

Warangal: కొండా ఎఫెక్ట్‌.. ఏఎస్పీ ట్రాన్స్ ఫ‌ర్‌!

వరంగ‌ల్‌, విధాత : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వరంగల్ డివిజన్ ఏఎస్పీగా ఎన్.శుభం ప్రకాష్ ను నియమిస్తూ శ‌నివారం ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. 2022 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన శుభం 2024లో వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ఆరు నెలల పాటు ట్రైనీ ఐపీఎస్ గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం వరంగల్ ఏసీపీ గా పనిచేస్తున్న నందిరాం నాయక్‌ డీజీపీ కార్యాలయానికి ట్రాన్స్‌ఫర్ అయ్యారు. కొండా ముర‌ళి ఎఫెక్టు వ‌ల్ల నందిరామ్ నాయ‌క్ బ‌దిలీ జ‌రిన‌ట్లు చర్చనడుస్తోంది. అ

యితే, నందిరామ్ నాయ‌క్ ఏఎస్పీగా బాధ్యలు చేప‌ట్టిన‌ప్పటి నుంచి కొండా సురేఖ‌, ముర‌ళి దంప‌తుల‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. స్వంత‌పార్టీ నేత‌ల‌తో పాటు విప‌క్ష పార్టీల నాయ‌కులు కూడా ఈ ఆరోపణలకు బలం చేకూర్చిన సందర్భాలున్నాయి. కొద్ది రోజుల క్రితం మాజీ ఎమ్మెల్సీగా ఉన్న కొండా ముర‌ళీధ‌ర్ రావుకు ప్రోటో కాల్ ఉల్లంఘించి కాన్వాయ్ ఏర్పాటు చేయ‌డ‌మే కాకుండా పైలెటింగ్ చేయ‌డం వివాదాస్పదంగా మారింది. దీనిపై పోలీస్ క‌మిష‌న‌ర్ స‌న్ ప్రీత్ సింగ్ తీవ్రంగా స్పందిస్తూ ఏఎస్పీ నాయ‌క్ తో పాటు ఇద్దరు సీఐల‌కు మెమో జారీ చేశారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న బ‌దిలీ కావ‌డ‌మే కాకుండా పోస్టింగ్ కూడా ఇవ్వలేదని సమాచారం.

వరంగల్ డివిజన్ నూతన ఏఎస్పీ

Exit mobile version