Site icon vidhaatha

Lady Aghori – Sri Varshini: లేడీ అఘోరీ షాక్‌.. మీడియా ముందుకు మొదటి భార్య

Lady Aghori – Sri Varshini:

విధాత : తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన లేడీ అఘోరీ శివ విష్ణు బ్రహ్మ అలియాస్ శ్రీనివాస్ కు సంబంధించి తరుచు కొత్త వివాదాలు వెలుగుచూస్తున్నాయి. ఇటీవల శ్రీవర్షిణి అనే యువతిని లేడీ అఘోరీ(శ్రీనివాస్) పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే లేడీ అఘోరీ అంతకుముందు తనను పెళ్లి చేసుకున్నాడని..తానే మొదటి భార్యనంటూ ఓ మహిళ మీడియా ముందు సంచలన ప్రకటన చేసింది. శ్రీనివాస్ పుట్టిన రోజు జనవరి 1న తనను పెళ్లిచేసుకున్నాడని..ఆ తర్వాత శ్రీ వర్షిణి అనే యువతిని జనవరి 30 పెళ్లి చేసుకున్నాడని.. మొదటి భార్య నేను ఉండగా.. మరో యువతిని ఎట్లా పెళ్లి చేసుకుంటాడంటూ ఆమె రచ్చకెక్కింది.

రెండో పెళ్లిపై తాను అఘోరీని నిలదీయగా మాది గురుశిష్యుల బంధం, తల్లి కూతుళ్ల బంధమని చెప్పాడని.. ఇప్పుడేమో భార్యభర్తలమంటున్నాడని బాధిత యువతి వాపోయింది. మీడియా, పోలీస్ శాఖ, ప్రభుత్వం ఈ విషయంలో అఘోరీపై చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయాలని కోరింది. మరింత మంది యువతులు అఘోరీ శ్రీనివాస్ బారిన పడకుండా కాపాడాలని కోరింది. కాగా మొదటి భార్యను తన ముద్దుల పెళ్లమా అంటూ లేడీ అఘోరీ శ్రీనివాస్ మాట్లాడిన ఆడియో కాల్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

నిత్యవివాదాల్లో లేడీ అఘోరీ

సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిలో నగ్న పూజలతో తొలిసారి వెలుగులోకి వచ్చిన లేడీ అఘోరీ తెలుగు రాష్ట్రాలలో నగ్నంగా ఆలయ సందర్శనలు చేస్తూ అడ్డుకుంటే ఆత్మార్పణ బెదిరింపులతో మరిన్ని వివాదాలకు కారణమయ్యాడు. తాను లోక కల్యాణం, సనాతన ధర్మం, హిందూమత సంరక్షణ సంకల్పంతో హిమాలయాల నుంచి జనబాహుళ్యంలోకి వచ్చానంటూ చెప్పుకొచ్చాడు. తెలంగాణలోని మంచిర్యాల మండలం కుశ్నపల్లిలో పుట్టి పెరిగిన అల్లూరీ శ్రీనివాస్ గా ఆరో తరగతి చదివే సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయి నాగసాధువుగా, లేడీ అఘోరీగా మారిన విషయం వెలుగు చూసింది. తర్వతా లేడీ అఘోరీ ట్రాన్స్ జెండర్ అని..అతడు పురుషుడా.. మహిళా అన్న చర్చ సాగింది.

ఇటీవల ఏపీలోని మంగళిగిరికి చెందిన శ్రీవర్షిణి అనే బీటెక్ యువతిని పెళ్లి చేసుకోవడం సంచలనం రేపింది. శ్రీ వర్షిణి తల్లిదండ్రులు తమ కూతురును లేడీ అఘోరీ కిడ్నాప్ చేసిందని ఫిర్యాదు చేయడంతో గుజరాత్ లో లేడీ అఘోరిని, శ్రీ వర్షిణిని పట్టుకున్నారు. పోలీసులు శ్రీ వర్షిణిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే శ్రీ వర్షిని మాత్రం తిరిగి లేడీ అఘోరీ వద్ధకే వెళ్లిపోయింది. మేం ఇద్దరం పెళ్లి చేసుకున్నామని..మా మధ్య సంసార సుఖం లేకపోయినా తమ పెళ్లి బంధం కొనసాగుతుందని వారు ప్రకటించారు. ఇంతలోనే “లేడీ అఘోరీ మొదటి భార్యను నేనే” అంటూ మరో యువతి తెరపైకి రావడంతో మరోసారి అఘోరీ వ్యవహారం చర్చనీయాంశమైంది.

Exit mobile version