విధాత: ఓ హత్య కేసులో దోషిగా తేలిన డేరా సచ్ఛా సౌధ చీఫ్ డేరా బాబా అలియాస్.. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది హరియాణాలోని సీబీఐ ప్రత్యేక కోర్టు. ఆయనతో పాటు మరో నలుగురు దోషులకు సైతం శిక్ష ఖరారు చేసింది.
డేరా బాబాను ఇటీవలే దోషిగా తేల్చిన హరియాణా, పంచకులలోని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ప్రత్యేక కోర్టు ఈమేరకు శిక్ష ఖరారు చేసింది. ఆయనతో పాటు మరో నలుగురికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. అలాగే.. డేరా బాబాకు రూ.31 లక్షలు, మిగతా వారికి రూ.50 వేల చొప్పున జరిమానా విధించింది.