విధాత : ఇప్పటిదాక ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీ బస్సుల్లో జుట్లు పట్టుకుంటున్న మహిళల సిగపట్ల యుద్దాలు…తాజాగా యూరియా క్యూలైన్లలో కూడా వ్యాపించాయి. మహబూబాబాద్‌లో యూరియా కోసం ఎదురుచూస్తున్న మహిళా రైతులు పరస్పరం గొడవ పడ్డారు. ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద ఆధార్ కార్డు నమోదు విషయంలో చెలరేగిన వాగ్వివాదం వారి మధ్య ఘర్షణకు దారితీసింది.
విపరీతమైన ఆవేశానికి గురైన మహిళలు క్యూలైన్లలో రైతులంతా చూస్తుండగానే పరస్పరం జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. వారిని తోటి రైతులు అతి కష్టం మీద అడ్డుకుని విడిపించారు. గత నెలరోజులుగా యూరియా కోసం నిరీక్షిస్తున్న రైతులు సహనం కోల్పోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందంటున్నారు.