విధాత : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ యువతులు మృతి చెందారు.
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన పులఖండంమేఘనారాణి(25), కడియాల భావన(24)లు కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణ క్రమంలో వారు ఇద్దరూ కూడా కాలిఫోర్నియాలో ఉంటున్నారు. స్నేహితులతో కలిసి వెకేషన్‌కి వెళ్లి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు లోయలో పడిపోవడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మేఘనారాణి, భావనలు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
ఇవి కూడా చదవండి :
Pooja Hegde | బుట్టబొమ్మ తళుకుల మెరుపులు… యువరాణిలా పూజా హెగ్డే
Vaikunta Ekadasi : వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన తిరుమల, యాదగిరిగుట్టలు
