విధాత: వేగంగా వెలుతున్న కారు డివైడర్ ను ఢీ కొట్టి 15ఫల్టీలు కొట్టిన ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా..మరో ముగ్గరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో కారు నాలుగులైన్ల జాతీయ రహదారిపై వెలుతూ డివైడరన్ ఢీ కొట్టింది. అక్కడి నుంచి మధ్యలోని లాన్ డివైడర్ మీదుగా ఫల్టీలు కొడుతూ ఇవతలి వరుస రహదారి చివరి వరకు ఫల్టీలు కొట్టింది. సినిమా స్టంట్‌ను తలపించే విధంగా కారు చాలా సార్లు పల్టీలు కొట్టిన ప్రమాద వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో బెంగళూరు నుంచి యాద్గిర్‌కు వెళ్తున్న కారు మోనకల్మూర్ తాలుకా చెల్లకెరి – బళ్లారి మధ్య బొమ్మక్కనహళ్లి మజీద్ వద్ధ జాతీయ రహదారి(ఎన్ హెచ్ 150ఏ) పై జరిగిన రోడ్డు ప్రమాదంలో వేగంగా వెళ్తుండగా అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అది చాలాసార్లు పల్టీలు కొట్టేలోపు ఎదురుగా ఉన్న లేన్ డివైడర్ ను ఢీకొట్టి దాని మీదుగా మరిన్ని ఫల్టీలు కొట్టింది. ప్రమాద తీవ్రతకు కారులోని వారు బయటకు విసిరేసినట్లుగా రోడ్డపైన ఎగిరి పడిపోయారు.
#Karnataka Shocking CCTV footage shows a Car flips 15 times, bodies thrown in the air, fatal accident on NH 150A pic.twitter.com/OiUHYAeMDH
— srk (@srk9484) April 2, 2025
ఈ ఘోర ప్రమాదంలో కారును నడుపుతున్న మౌలా అబ్దుల్ (35), అతడి ఇద్దరు కుమారులు – రహ్మాన్ (15), సమీర్ (10) అక్కడికక్కడే మృతిచెందారు. మిగతా కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో అబ్దుల్ భార్య సలీమా బేగం (31), తల్లి ఫాతిమా (75), మరొక కుమారుడు హుస్సేన్ ఉన్నారు. గాయపడిన వారిని పోలీసులు వెంటనే బళ్లారిలోని విమ్స్ ఆసుపత్రికి తరలించారు.
ప్రత్యక్షదర్శులు తెలిపిన వివరాల ప్రకారం, కారు అధిక వేగంతో ప్రయాణిస్తుండడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. హైవేపై వేగంగా ప్రయాణించే సమయంలో డ్రైవర్ కంట్రోల్ కోల్పోవడంతో ప్రమాదం చోటుచేసుకుందనే అభిప్రాయాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రత్యేకంగా, ఓ వ్యక్తి కారు పల్టీలు కొడుతున్న సమయంలో గాల్లోకి ఎగిరి కిందపడిన దృశ్యం చూసిన నెటిజన్లు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు.
#Karnataka Shocking CCTV footage shows a Car flips 15 times, bodies thrown in the air, fatal accident on NH 150A pic.twitter.com/OiUHYAeMDH
— srk (@srk9484) April 2, 2025