విధాత: ఇటీవల మలయాళ నాట విడదలైన సంచలనం సృష్టిసున్న చిత్రం మార్కో. భాగమతి, జనతా గ్యారేజ్ సినిమాలతో తెలుగువారికి బాగా సుపరిచితమైన ఉన్ని ముకుందన్ ఈ సినిమాలో హీరో, కబీర్ దుహాన్ సింగ్ ప్రతినాయకుడు.
డిసెంబర్20న కేరళలో రిలీజైన ఈ సినిమా అక్కడ బాక్సాపీస్ రికార్డులు తిరగరాస్తోంది. అంతేగాక తొలిసారి హిందీలో థియేట్రికల్ రిలీజ్ జరుపుకున్న ‘మార్కో’ గతంలో ఏ మలయాళ సినిమాకు సాధ్యం కానీ విధంగా అదిరిపోయే కలెక్షన్లను దక్కించుకుంటోంది.
హాలీవుడ్ జాన్ విక్, బాలీవుడ్ కిల్ తరహాలో ప్రారంభం నుంచి చివరి వరకు ఔట్ అండ్ ఔట్ యాక్షన్, హింసాత్మక సీన్లతో రూపొందిన ఈ చిత్రాన్ని మేకర్స్ ఇప్పుడు తెలుగులోకి తీసుకురానున్నారు.
జనవరి1న ఈ సినిమాను ప్రంచవ్యాప్తంగా తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు మేకర్స్ అధికారికి ప్రకటన విడుదల చేస్తూ ఓ పోస్టర్ షేర్ చేశారు.