- అకాల వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు నష్ట పరిహారం
- మంత్రి సీతక్క హామీ
- నివేదిక అందించాలని అధికారులకు ఆదేశం
మంత్రి తుమ్మలకు ఫోన్
Minister Seethakka | తడిసిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. శుక్రవారం ములుగు నియోజక వర్గంలోని అమృతండా, లక్ష్మిపూర్, కర్లపల్లి ,మరియు చంద్రుతండా ల్లో అకాల వడగండ్ల వర్షం వలన నష్టపోయిన పంటపొలాలను పరిశీలించారు. కొతకు వచ్చిన వరి పంట నీటిపాలై జరిగిన నష్టాన్ని చూసిన సీతక్క వెంటనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కు ఫోన్ చేసి జరిగిన పంట నష్టాన్ని వివరించి నష్టపరిహారం ఇవ్వాలని కోరింది. దీనికి స్పంధించిన మంత్రి నష్ట పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో వెంటనే వ్యవసాయ అధికారులను పంట నష్టం అంచనా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ రైతులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు నష్ట పరిహారం అందిస్తామని, తడిసిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు.