Site icon vidhaatha

Telangana: మంత్రి పద‌వి తెచ్చిన తంటా..! ప్రేమ్ సాగర్ రావు విమర్శలకు వివేక్ కౌంటర్

Telangana:

విధాత : మంత్రి పదవి రాకుండా తన గొంతుకోస్తున్నారంటూ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ పై చేసిన విమర్శలు హాట్ టాపిక్ గా మారాయి. కాగా తనపై ప్రేమ్ సాగర్ రావు చేసిన విమర్శలకు వివేక్ కౌంటర్ ఇచ్చారు. కాకా కుటుంబం అంటేనే సేవ చేసే కుటుంబమని.. మా కుటుంబంపై పరోక్షంగా విమర్శలు చేయడం మంచి పద్దతి కాదన్నారు. గత ఎన్నికల్లో కాకా కుటుంబం ద్వారానే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తన ఇంటికి వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తేనే కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు.

పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఇప్పటివరకు కాకా కుటుంబం నుంచే ఎంపీలుగా గెలిచి సత్తా చాటామని గుర్తు చేశారు. దమ్ము ధైర్యం ఉంటే నాపై పోటీ చేసి గెలవాలని అహంకారంతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన సవాల్ ను స్వీకరించి 22 రోజులలోనే ప్రచారం చేసి బాల్క సుమన్ చిత్తుగా ఓడించి సత్తా చూపానన్నారు. బీజేపీలో కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉన్నప్పటికి కూడా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యానని చెప్పుకొచ్చారు.

కొందరు పోలీసులను అడ్డుపెట్టుకొని బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారన్నారు. అలాంటి రాజకీయాలు అంటే నాకు అసహ్యమన్నారు. నియోజకవర్గంలో ఏ నాయకుడు ఏం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. నేను వచ్చాక చెన్నూరు నియోజకవర్గంలో ఇసుక, బియ్యం దందాలకు అడ్డుకట్ట వేశానని వివేక్ తెలిపారు. నాయకులు మంచి పనులు చేస్తేనే ప్రజల్లో గుర్తింపు ఉంటుందన్నారు. ఆ గుర్తింపే ఎన్నికల్లో గెలుపుకు నాంది అవుతుందని వివేక్ వెంకట స్వామి స్పష్టం చేశారు.

అంతకుముందు ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీ అన్ని పార్టీలు తిరిగి వచ్చిన వారు కూడా ఇవాళ మంత్రి పదవి అడుగుతున్నారని వివేక్ పై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సభలో డిప్యూటీ సీఎం భట్టి సాక్షిగా ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వినోద్ లపై ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు విమర్శలు చేశారు. పార్టీలు తిరిగి వచ్చిన వారు ఈరోజు నాకు మంత్రి పదవి రాకుండా నా గొంతు కోసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు అండగా నేను ఉన్నానని, మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేయవద్దని, లేదంటే దేనికైనా సిద్ధమన్నారు.

Exit mobile version