Viral | motor meter
విధాత : వ్యవసాయం అంటేనే పాములు..తేళ్లు వంటి వాటితో నిత్య సావాసం మధ్య రైతు సాగించే జీవన పోరాటం. పంటల సాగు పనులు చేస్తూ పాము, తేలు కాటుకు గురై ఎక్కడో ఓచోట రైతులు చనిపోతున్న వార్తలు వెలుగుచూస్తుంటాయి. ఓ రైతు తన పొలానికి నీరు పెట్టేందుకు వ్యవసాయ మోటార్ ఆన్ చేసేందుకు వెళితే స్టాటర్ బాక్స్ లో నాగుపాము కనిపించిన వీడియో వైరల్ గా మారింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని ఓ గ్రామ రైతు రాములు తన పొలానికి నీరు పెట్టేందుకు మోటార్‌ని ఆన్ చేయడానికి వెళ్లారు. మోటార్ స్టాటర్ బాక్స్ ను తెరిచి స్విచ్ ఆన్ చేద్దామని బాక్స్ తెరవగా..బుసలు కొడుతూ పడగ విప్పి నాగు పాము కనిపించింది. దీంతో భయాందోళనకు గురైన రైతు ఒక్క ఉదుటున వెనక్కి జరిగి పాముకాటును తప్పించుకున్నాడు.
పాము సమాచారాన్ని స్థానికుల సహాయంతో స్నేక్ క్యాచర్ కు అందించగా..వారు వచ్చి చాకచక్యంగా పామును బంధించి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోను స్నేక్ క్యాచర్లు రైతులను అప్రమత్తం చేసేందుకు చేసిన వీడియోగా నెటిజన్లు అనుమానిస్తున్నారు. మోటార్ స్టాటర్ బాక్స్ ల వద్ద రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించేందుకే వారు అలా చేశారని తెలుస్తుంది.
మోటార్ మీటర్లో పాము కలకలం మోటార్ ఆన్ చేద్దామని వెళ్తే.. కరెంట్ మీటర్లో బుస్సుమంటూ కనిపించని పాము భయంతో పరుగులు తీసిన రైతన్న.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మీటర్లు ఆన్ ముందు జాగ్రత్తగా ఉండాలని.. రైతులను సూచిస్తున్న అధికారులు #snake #viral pic.twitter.com/vgIqg5GSLV
— YVN REDDY (@YVNREDDY12) July 22, 2025
ఇవి కూడా చదవండి..
Dam Flood | ముంచుకొచ్చిన డ్యామ్ వరద.. రెప్పపాటులో తప్పిన చావు!
Sasi Tharoor Vs Congress | కాంగ్రెస్ పార్టీ నుంచి శశిథరూర్ నిష్క్రమణ తప్పదా?
PM Mallikarjuna Kharge? | మోదీ రాజీనామా చేస్తే ఖర్గే ప్రధాని!