Daaku Maharaaj:
విధాత: చాలామంది సినీ లవర్స్ ఎదురు చూస్తున్న అప్డేట్ వచ్చింది. ఇటీవల సంక్రాంతికి భారీ సినిమాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించిన బాలకృష్ణ (Nandamuri Balakrishna) డాకు మహారాజ్ (Daaku Maharaaj) సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ తేదీ వచ్చేసింది. ఈ మేరకు సదరు ఫ్లాట్‌ఫాం అధికారిక ప్రకటన చేసింది. బాలయ్య వరుసగా రూ100కోట్ల క్లబ్‌లో చేర్చిన ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ ఈ మూవీని నిర్మించగా బాబీ కొల్లి దర్శకత్వం వహించారు. తమన్ సంగీతం అందించాడు. ప్రజ్యా జైస్వాల్ (Pragya Jaiswal), శ్రద్ధా శ్రీనాధ్ (Shraddha Srinath), ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) కథానాయికలుగా, బాబీ డియోల్ (Bobby Deol) ప్రతి నాయకుడిగా నటించారు. #DaakuMaharaajOnNetflix
కథ విషయానికి వస్తే.. మదనపల్లి ఓ కాఫీ ఎస్టేట్ అధిపతి అయిన కృష్ణమూర్తి లోకల్‌గా విద్యాసంస్థను నడిపిస్తూ ఒంటరి అయిన తన మనుమరాలు (వైష్ణవి)ని అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. అయితే స్థానిక ఎమ్మెల్యేతో ఆ ఫ్యామిలీకి ముప్పె వచ్చి పడుతుంది. ఈ విషయం కాస్త డాకూ మహారాజ్‌కు తెలిసి నానాజీ ఆ ఇంట్లో కారు డ్రైవర్‌గా చేరి పాపను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఈ క్రమంలో బల్వంత్ ఠాకూర్‌కు సంబంధించిన క్రూరమైన గ్యాంగ్, అదేవిధంగా పోలీసుల టీం రంగంలోకి దిగుతుంది. చివరకు నానాజీ వారి నుంచి ఆ ప్యామిలీని, కాపాడాడా వైష్ణవికి నానాజీ ఉన్న సంబంధం ఏంటీ, ఇంతకు మహారాజ్ ఎవరు?భోపాల్‌లో ఎందుకు ఉండాల్సి వచ్చింది? బల్వంత్ ఠాకూర్ (బాబీ దేవోల్), నందిని (శ్రద్ధా శ్రీనాథ్)లకు సంబంధం ఏంటనే ఆసక్తికరమైన కథకథనాలతో సినిమా ఆద్యంతం ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది.
ఇదిలాఉండగా.. ఈ సినిమా కథ కొత్తదేమీ కాకపోయినా దర్‌శకుని ప్రతిభ, స్లోరీ నెరేషన్ చూసే వారిని విపరీతంగా ఆకట్టుకుంటాయి. విజువల్స్ కూడా మెస్మరైజ్ చేస్తాయి. ఫస్టాఫ్ కన్నా సెకండాఫ్ సినీ లవర్స్‌ను సీట్‌లో కూర్చొనివ్వని యాక్షన్ అంశాలతో రక్తి కట్టిస్తారు. ఇప్పుడీ సినిమా చ్చే వారం అంటే ఫిబ్రవరి 21 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీ (OTT)లో స్ట్రీమింగ్ అవనుంది. సో.. ఎవరతే థియేటర్లలో మిస్సయ్యారో, మరోమారు చూడాలనుకునే వారు ఎట్టి పరిస్థుతుల్లోనూ ఈ డాకు మహారాజ్ (Daaku Maharaaj) సినిమాను చూసి ఎంజాయ్ చేయవచ్చు.