Site icon vidhaatha

Turmeric Board | నిజామాబాద్ పసుపు పంటకు క్యాపిటల్ సిటీ : అమిత్ షా

Turmeric Board | 40 ఏళ్లుగా పసుపు బోర్డు కోసం పోరాడుతున్న రైతుల కల నేరవేరిందని, నిజామాబాద్ పసుపు పంటకు రాజధాని లాంటిదని కేంద్ర మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఆదివారం తెలంగాణలో పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించి పసుపు ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడారు. తన చేతుల మీదుగా పసుపు బోర్డు ప్రారంభం కావడం అదృష్టంగా ఉందన్న అమిత్ షా.. పసుపు రైతులకు ఇచ్చిన హామీ మేరకు పసుపు బోర్డు ఏర్పాటు చేశామన్నారు. ఈ రోజు తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. పసుపు రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని హామి ఇచ్చారు. దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి పసుపు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. పసుపు దివ్య ఔషధం లాంటిదని ఈ సంపద నిజామాబాద్ నుంచి ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతుందని తెలిపారు అమిత్ షా.. కార్యక్రమంలో అమిత్ షాతో పాటు రాష్ట్ర మంత్రులు తుమ్మల, సీతక్క, ఎంపీలు అరవింద్, లక్ష్మణ్, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version