ఎంపీ రఘురామ కృష్ణంరాజుని ఆర్మీ ఆసుపత్రికి తరలించిన అధికారులు

ఎంపీ రఘురామ కృష్ణంరాజుని సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ నివేదకను 21వ తేదీన సుప్రీంకోర్టుకి అందచేయాలని చెప్పింది. అప్పటివరకు రఘురామ కృష్ణంరాజు జ్యుడీషియల్ కస్టడీ లో ఉంటారని పేర్కొంది. దీనికి సంబంధించి జ్యుడీషియల్ అధికారిని తెలంగాణా హైకోర్టు నియమించాలని ఆదేశించింది. మరో వైపు రఘురామ కృష్ణంరాజు బెయిల్ పిటీషన్ పై గురువారం లోపు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. శుక్రవారం […]

  • Publish Date - May 17, 2021 / 10:08 AM IST

ఎంపీ రఘురామ కృష్ణంరాజుని సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ నివేదకను 21వ తేదీన సుప్రీంకోర్టుకి అందచేయాలని చెప్పింది. అప్పటివరకు రఘురామ కృష్ణంరాజు జ్యుడీషియల్ కస్టడీ లో ఉంటారని పేర్కొంది.

దీనికి సంబంధించి జ్యుడీషియల్ అధికారిని తెలంగాణా హైకోర్టు నియమించాలని ఆదేశించింది. మరో వైపు రఘురామ కృష్ణంరాజు బెయిల్ పిటీషన్ పై గురువారం లోపు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. శుక్రవారం దీనిపై విచారణ జరుపుతామని ప్రకటించింది