Site icon vidhaatha

Raja Singh | ఆఫీస్ టేబుల్ ఎవరు సాఫ్ చేస్తే వాళ్ళకి పెద్ద పోస్టులు.. కిషన్ రెడ్డిపై రాజాసింగ్ ఫైర్ !

Raja Singh |

విధాత: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బీజేపీ టికెట్ ను ఎన్. గౌతమ్ రావుకు ఇవ్వడం పట్ల రాజాసింగ్ మండిపడ్డారు. ఆ బీజేపీలో ఉన్న పెద్ద అధికారి మేకప్ మెన్ కు చెందిన ఆఫీస్ టేబుల్ ఎవరు సాఫ్ చేస్తే వాళ్ళకి పెద్ద పెద్ద పోస్టులు.. పెద్ద పెద్ద టికెట్లు ఇస్తారంటూ పరోక్షంగా కిషన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. నీ మనిషి.. నా మనిషి అంటూ ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ తమాషా అని అసహనం వ్యక్తం చేశారు.

శ్రీరామనవమి శోభాయాత్ర నేనెందుకు తీస్తానో తెలుసా అంటూ.. హిందువులు అంతా ఒకటి కావాలి.. తెలంగాణలో రామరాజ్యం రావాలనే ఉద్దేశంతోనే నేను శ్రీరామనామి శోభాయాత్ర నిర్వహిస్తున్నానన్నారు. శోభయాత్ర సందర్భంగా ఇప్పటికే ఎన్నో కేసులు నా పైన మోపినా కూడా భయపడకుండా నేను ప్రతి ఏడాది శోభాయాత్ర నిర్వహిస్తున్నానన్నారు. నా శ్రీరామనవమి శోభ యాత్రలో రామభక్తులు తక్కువ రావాలనే ఉద్దేశంతోనే అంబర్ పేట నుంచి ఇంకొక శోభాయాత్ర తీస్తున్న గౌతమ్ రావుకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారని రాజాసింగ్ ఆరోపించారు.

మీరు కాదు.. మీ అయ్యలు కూడా ప్రయత్నం చేసినా.. నా దగ్గరకు వచ్చే రామ భక్తులను మీరు ఆపలేరంటూ రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ చేసిన విమర్శలు రాష్ట్ర బీజేపీలోని వర్గ పోరును మరోసారి బహిర్గతం చేసినట్లయ్యింది. ఇప్పటికే అంతర్గత లుకలుకలతో రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసుకోలేకపోతున్నఆ పార్టీకి రాజాసింగ్ రెబల్ గా మారి చేస్తున్న విమర్శలు రాజకీయంగా మరింత ఇరకాటంగా తయారయ్యాయి.

Exit mobile version