పవన్ కళ్యాణ్ తో సినీ ప్రముఖుల భేటీ

విధాత‌: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పలువురు సినీ పరిశ్రమ ప్రముఖులు భేటీ అయ్యారు.చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై పవన్ కళ్యాణ్ తో వారు చర్చించారు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, వంశీ రెడ్డి , సునీల్ నారంగ్, బన్నీ వాసుతో పాటు పలువురు ప్రముఖులు పవన్ తో సమావేశం అయ్యారు. తన మీద కక్షతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సినీ పరిశ్రమను ఇబ్బంది పెడుతోందని…సినిమా టిక్కెట్ల అమ్మకాల విషయంలో ప్రభుత్వం పై పవన్ […]

  • Publish Date - October 1, 2021 / 12:23 PM IST

విధాత‌: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పలువురు సినీ పరిశ్రమ ప్రముఖులు భేటీ అయ్యారు.చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై పవన్ కళ్యాణ్ తో వారు చర్చించారు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, వంశీ రెడ్డి , సునీల్ నారంగ్, బన్నీ వాసుతో పాటు పలువురు ప్రముఖులు పవన్ తో సమావేశం అయ్యారు.

తన మీద కక్షతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సినీ పరిశ్రమను ఇబ్బంది పెడుతోందని…
సినిమా టిక్కెట్ల అమ్మకాల విషయంలో ప్రభుత్వం పై పవన్ విమర్శల నేపథ్యంలో మంత్రి పేర్ని నానితో సినీ ప్రముఖులు కలిశారు.తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ ను సినీ ప్రముఖులు కలవడంతో ఈ సమావేశానికి ప్రత్యేకత సంతరించుకుంది.