Site icon vidhaatha

ప్రముఖ కార్మిక నాయకుడు ఎల్లయ్య మృతి

విధాత : ప్రముఖ, సీనియర్ కార్మిక నాయకుడు జీ.ఎల్లయ్య (84) శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. బీహెచ్ఈఎల్ లో కార్మికుడిగా చేరి అంచెలంచలుగా ఎదిగి తొమ్మిది సార్లు కార్మిక నాయకుడిగా ఎన్నికయ్యారు. ఆయన మరణం పట్ల పలువురు కార్మిక నాయకులు, నేతలు సంతాపం ప్రకటించారు. శనివారం మధ్యాయం బీహెచ్ఈఎల్ రామచంద్రాపురంలోని
శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 1941 జూన్ 5వ తేదీన ఎల్లయ్య జన్మించాడు. 1965తో బీహెచ్ఈఎల్ లో ఓ సాధారణ కార్మికుడిగా ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన.. నాగం కృష్ణా రావు, డా.మల్లికార్జున్, బంగారు లక్ష్మణ్, జీ.వెంకటస్వామి, జీ.సంజీవరెడ్డి‌ల నాయకత్వంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా.. ఆ తర్వాత పాండురావు ప్రెసిడెంట్ గా, ఎల్లన్న జనరల్ సెక్రటరీ గా 1984 వరకు పనిచేశారు. 1989 నుండి 1996 వరకు మూడు సార్లు వరుసగా, ఆ తర్వాత మరోసారి మూడుసార్లు అనంతర తొమ్మిది సార్లు కార్మిక సంఘం అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యారు. అనంతరం 1999లో ఉద్యోగానికి వీఆర్ఎస్ రిటైర్‌మెంట్ తీసుకున్నాడు.

ఎల్‌ఐజీ, ఎమ్ఐజీ-1, ఎమ్ఐజీ-2 ద్వారా కార్మికులకు స్వంత ఇల్లు సాధించడం, కార్మికులకు కార్పొరేట్ వైద్య సౌకర్యాలు.. చనిపోయిన ఎంప్లాయిస్ పిల్లలకు పర్మనెంట్ ఉద్యోగాలు ఇప్పించడంలో ఎల్లయ్య ముందుండి పోరాడారు. బీహెచ్ఈఎల్, బీడీఎల్, డిఫెన్స్ కంపెనీలో, ఎమ్మార్ఎఫ్ కంపెనీలల్లో స్థానికులకే ఉద్యోగాలివ్వాలని ఎల్లయ్య ఉద్యమాలు చేసి.. స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా పోరాటం చేశారు. 1969లో తెలంగాణ వాదులు చెన్నారెడ్డి, మల్లికార్జున్ తో ఎల్లయ్య ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. 2001లో టీఆర్‌ఎస్ స్థాపించిన నాటి నుంచి కేసీఆర్‌తో కలిసి ప్రతి ఉద్యమంలో పాల్గొన్నారు.

అసెంబ్లీ ముట్టడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నపుడు రెండు కాళ్లు విరిగిపోవడంతో 2 నెలలు హాస్పిటల్లో ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. ప్రస్తుతం బీహెచ్ఈఎల్ ఉద్యోగులు పొందుతున్న ప్రతి సౌకర్యం ఎల్లన్న సాధించినవే కావడం విశేశం. 1965 నుండి ఈరోజు తుది శ్వాస వదిలేవరకూ బీహెచ్ఈఎల్ కార్మికులు, కంపెనీ బాగుండాలని పరితపించారు. ఎల్లయ్య మొదటి నుండి కాంగ్రెస్ వాదిగా ఉన్నారు. ఐఎన్టీయూసీ యూనియన్ ను బీహెచ్ఈఎల్ లో, బీడీల్, డిఫెన్సె లాంటి అనేక కంపెనీ లల్లో బలంగా తయారు చేశాడు. జనార్దనరెడ్డి, భాగరెడ్డి, డా.మల్లికార్జున్ లతో ఎల్లయ్య చాలా సన్నిహితంగా ఉండేవారు.

Exit mobile version