Tomato
విధాత: పెరిగిన టమాటా ధరలు వినియోగదారుల జేబులు చిల్లు చేస్తుండగా.. వాటిని పండిస్తున్న రైతన్నల ఇంట్లో కాసుల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా పూణేకు చెందిన రైతు టమాటాలు అమ్మడం ద్వారా ఒక నెలలోనే రూ.3 కోట్ల లాభాలు ఆర్జించాడు.
పచ్‌ఘడ్ గ్రామానికి చెందిన ఈశ్వర్ గాయ్‌కర్ (36)కు 12 ఎకరాల పొలం ఉంది. టమాటా ధరలు పెరగుతుండటంతో ఎలాగైనా లాభాలు పొందాలని రూ. 40 లక్షలతో రిస్క్ చేసైనా మొత్తం అన్ని ఎకరాల్లోనూ టమాటా పంట వేశాడు.
జూలై 11 నుంచి 18 మధ్య పంటను కోసి అమ్మగా సుమారు రూ.3 కోట్లు చేతికందాయి. తాను సుమారు 18 వేల క్రేట్ల (బాక్సుల) టమాటాలను అమ్మానని ఈశ్వర్ వెల్లడించాడు. ప్రస్తుతం తన వద్ద మరో 4 వేల క్రేట్ల టమాటాలు సిద్ధంగా ఉన్నాయని వీటి ద్వారా రూ.50లక్షలు వచ్చే అవకాశముందని తెలిపాడు.
అయితే ఇదే ఈశ్వర్ అంతకు ముందు నెల మేలో టమాటాకు ధరలు లేకపోవడంతో పెద్ద మొత్తంలో పంటను డంప్ చేసేశాడు. అయినా నిరాశ చెందకుండా ఉందిలే మంచి కాలం ముందూ ముందూనా అనుకుంటూ.. కష్టపడి టమాటా సాగు చేశాడు. కోటీశ్వరుడయ్యాడు.