Site icon vidhaatha

Rahul Sipligunj : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్

rahul-sipligunj-meets-cm-revanth-reddy-receives-1-crore-award

Rahul Sipligunj | విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj) కు తెలంగాణ ప్రభుత్వం తరుపున రూ. కోటి నగదు ప్రోత్సాహకాన్ని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రకటించారు. బోనాల(Bonalu) పండుగ సందర్బంగా గతంలో ఇచ్చిన హామీ మేరకు రూ.కోటి నగదు పురస్కారాన్ని అందించారు. ఈ నేపథ్యంలో రాహుల్ సిప్లిగంజ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటునాటు పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్ కు అస్కార్ అవార్డు లభించింది.

అసెంబ్లీ ఎన్నికలకు ముందే 2023లోనే ఓ ప్రోగ్రాంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆస్కార్ గెలుచుకున్న రాహుల్‌ సిప్లిగంజ్‌కు రూ.10 లక్షలు నగదు ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కోటి రూపాయల నగదు ఇస్తామని చెప్పారు. ఆర్టిస్టులను సన్మానించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆనాడు రేవంత్ చెప్పినట్టుగానే ఇటీవల సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌కు కోటి రూపాయలను బహుమతిగా ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం.

గద్దర్ అవార్డుల వేడుకలోనే రాహుల్‌ సిప్లిగంజ్‌ గురించి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అవార్డు ఇవ్వకపోయినా ఏదో ఒకటి ఇవ్వాలని సీఎం చెప్పగా.. దానికి డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క తల ఊపుతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బోనాల సందర్భంగా రాహుల్కు కోటి రూపాయల నజరానా ప్రకటించి రేవంత్ రెడ్డి తను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.

Exit mobile version