విధాత: ఇటీవలే డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల హీరోయిన్‌గా బిజీగా ఉన్నప్పటికీ పుష్ఫ2 ది రూల్ సినిమాలో ప్రత్యేక పాట చేసి మెప్పించింది. ఇప్పుడు అదే కోవలోకి మరో కథానాయిక రెబా మౌనిక జాన్ (Reba Monica John) ఐటం సాంగ్‌కు స్టెప్పులేయడానికి సిద్ధమైంది. తన కేరీర్‌లో హీరోయిన్‌గా మంచి విజయాలే ఉన్నప్పటికీ చేతిలో సినిమాలు మాత్రం లేవు.
గత సంవత్సరం శ్రీవిష్ణు హీరోగా వచ్చిన సామజవరగమన సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మలయాళీ ముద్దుగుమ్మ రెబా మౌనిక జాన్ (Reba Monica John). ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఆఫర్లు బాగానే తలుపులు తడుతాయని అనుకున్నప్పటికీ నిరాశే మిగిలింది. ఆ తర్వాత మరో తెలుగులో సినిమాలో కనిపించని ఈ చిన్నది ఇతర సౌత్ భాషల్లో 20కి పైనే చిత్రాల్లో నటించింది.
ఈ నేపథ్యంలోనే నార్నే నితిన్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మ్యాడ్ సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్‌లో ఓ ప్రత్యేక గీతం చేయడానికి ఒప్పుకుందని తర్వలోనే ఈ పాట చిత్రీకరణ జరుగనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ మూవీ 2025 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.