విధాత, హైదరాబాద్ : దేశంలో అనేక రకమైన దాడులతో మనుషుల ప్రాణాలు పోతుంటే..కేవలం కుక్కకాటు మరణాలపైనే రాద్దాంతం ఎందుకు చేస్తున్నారని సినీ నటి రేణు దేశాయ్ మండిపడ్డారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏడాదికి దోమకాటుతో 10 లక్షల మంది చనిపోతున్నారు అని వాళ్లవి ప్రాణాలు కాదా? కేవలం కుక్క కరిచి ఒక్కరు చనిపోతే అది మాత్రమే ప్రాణమా? అని ప్రశ్నించారు. అన్యాయంగా కుక్కల్ని చంపితే కర్మ మిమ్మల్ని వదిలిపెట్టదు అని ఆక్షేపించారు. కుక్కలన్నీ మంచివే అని నేను చెప్పనని, కుక్కల దాడిలో చిన్న బిడ్డలు చనిపోయారు అని..అలాంటి సంఘటనల్లో ఒక తల్లిగా బిడ్డలను కోల్పోయిన ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు అని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు.
ఎక్కొడో కొన్ని కుక్కలు కరిస్తే మిగతా కుక్కలన్నింటినీ చంపేయడం సరికాదన్నది నా అభిప్రాయమని, మగాళ్లు రేప్ చేస్తారు అని, మర్డర్లు కూడా చేస్తారని…అంతమాత్రాన మగాళ్లందర్నీ రేపిస్టులు, హంతకులు అంటామా? అని రేణు దేశాయ్ ప్రశ్నించారు. రేపులు, మర్డర్లు చేసిన మగాళ్లందర్నీ పట్టుకుని చంపేయాలా? అని, ఈ రకమైన వాదన చేసేందుకు కొంచేమైనా బుద్ది ఉందా? అంటూ మండిపడ్డారు. గతంలోనూ రేణు దేశాయ్ సోషల్ మీడియాలో కుక్కుల సామూహిక హత్య, జంతు బలి వంటి అంశాలను వ్యతిరేకిస్తూ పోస్టులు పెట్టడం గమనార్హం.
ఇవి కూడా చదవండి :
Health Tips : డిప్రెషన్‌తో బాధపడుతున్నారా..? ఈ సమస్యకు వ్యాయామంతో చెక్ పెట్టండి
Greenland Annexation | గ్రీన్ ల్యాండ్ స్వాధీనానికి టైమ్ వచ్చేసింది: ట్రంప్ సంచలన పోస్టు
