Akira Nandan | ఏఐతో అకిరా హీరోగా సినిమా… పవన్ క‌ళ్యాణ్‌, రేణూ దేశాయ్ గెస్ట్ పాత్ర‌ల్లో..!

Akira Nandan | ఇప్పటి ప్రపంచం ఏఐతో నిండి పోతుంది. ఊహల్లో మాత్రమే ఉన్న దృశ్యాలకు కూడా ఇప్పుడు రూపం ఇస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మంచికీ, చెడుకీ వాడుతున్న ఈ సాంకేతికత ఇప్పుడు సినీ పరిశ్రమలో పెద్ద చర్చనీయాంశమైంది.

Akira Nandan | ఇప్పటి ప్రపంచం ఏఐతో నిండి పోతుంది. ఊహల్లో మాత్రమే ఉన్న దృశ్యాలకు కూడా ఇప్పుడు రూపం ఇస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మంచికీ, చెడుకీ వాడుతున్న ఈ సాంకేతికత ఇప్పుడు సినీ పరిశ్రమలో పెద్ద చర్చనీయాంశమైంది. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా ఏఐతోనే ఒక గంట నిడివి గల పూర్తి సినిమానే తయారుచేసి నెటిజన్లను షాక్‌కు గురిచేశాడు. ఈ ఏఐ చిత్రం ప్రత్యేకత ఏమిటంటే పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్‌ను హీరోగా,హాలీవుడ్ నటి విక్టోరియాను హీరోయిన్‌గా, రజినీకాంత్, విల్ స్మిత్, మోహన్ బాబు, రేణు దేశాయ్, లియోనార్డో డికాప్రియో, జాక్విన్ ఫీనిక్స్, గౌతమ్ ఘట్టమనేని, ఆర్నాల్డ్ స్క్వాజ్‌నెగర్, బ్రిట్నీ పియర్స్, పవన్ కళ్యాణ్ వంటి పలువురు టాప్ సెలబ్రిటీలను గెస్ట్ పాత్రల్లో చూపిస్తూ ‘AI Love Story’ పేరుతో సినిమా సృష్టించారు.

ఈ ఏఐ మూవీ యూట్యూబ్‌లో పెట్టినప్పటి నుంచి చాలా మందికి తెలియకపోయినా, ఇప్పుడు అకిరా లుక్, పవన్-రేణు దేశాయ్ చివరి సీన్, గౌతమ్ ఘట్టమనేని ఎంట్రీ వంటివి వైరలవ్వడంతో వీడియో ట్రెండింగ్‌లోకి వచ్చింది. పవన్ ఫ్యాన్స్ ఈ సినిమాను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. ‘AI Love Story’ పూర్తిగా టెక్నికల్ కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుంది.గ్రహాల ప్రయాణం, బ్రెయిన్ డేటా, భవిష్యత్తు టెక్నాలజీ, లవ్ & సస్పెన్స్ ఎలిమెంట్స్ ఇలా అన్ని జానర్స్‌ను మిక్స్ చేస్తూ కథను నడిపించారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ వీడియోను ఎంజాయ్ చేస్తూ ..అకిరా అసలైన డెబ్యూ ఇదే అనుకోవాలా?”, ఏఐ రోజులు మొదలయ్యాయి, హీరోలు లేకపోయినా సినిమాలు సాగే కాలం వచ్చేసింది”
అంటూ కామెంట్లు చేస్తున్నారు.

నిజమైన నటీనటుల ముఖాలను ఏఐ ద్వారా వాడుతూ సినిమాలు తీయడం సరైందా? ఇది లీగల్‌గా కరెక్టా? అనే చర్చ కూడా తెర‌పైకి వ‌చ్చింది. దీనిపై ఇప్పటివరకు ఏ సెలబ్రిటీ గానీ, ఏ సినీ సంస్థ గానీ స్పందించలేదు. భవిష్యత్తులో ఇదే అత్యంత పెద్ద చర్చ అవుతుందన్నది మాత్రం ఖచ్చితంగా చెప్ప‌వ‌చ్చు. ఈ ఏఐ మూవీ చూపించిన విధంగా “సినిమాల్లో నటీనటులు లేకుండానే, వారి డిజిటల్ రూపాలతోనే చిత్రాలు రూపొందించే రోజులు దగ్గరలోనే ఉంటాయని” నెటిజన్లు భావిస్తున్నారు. మొత్తానికి, అకిరా నందన్‌ను ఏఐతో హీరోగా చూపించిన ఈ ప్రయోగం ప్రస్తుతం సోషల్ మీడియాలో మంచి సెన్సేషన్‌గా మారింది.

 

Latest News