King Cobra | 12 అడుగుల కింగ్‌ కోబ్రాను ముద్దాడిన సాహసి.. చూశారంటే.

King Cobra | విధాత‌: పాములంటేనే హడలెత్తిపోతాం. చిన్నగా ఉన్నా.. విషపూరితం కాదని తెలిసినా భయం మాత్రం అలానే ఉంటుంది. అలాంటి కింగ్‌ కోబ్రా (King Cobra)కనిపిస్తే.. పై ప్రాణాలు పైనే పోవడం ఖాయం. కానీ.. కొందరు సాహసులు ఉంటారు. వారికి కోబ్రాలతో ఆడుకోవడం సరదా! ఎక్కడ ఎవరి ఇళ్లలోనైనా కోబ్రాలు కనిపించినా.. వెళ్లి వాటిని రక్షించి, సమీప అటవీ ప్రాంతాల్లో వదిలివేసే ‘ఫ్రెండ్స్‌ ఆఫ్‌ స్నేక్స్‌’ ఉంటారు. కానీ.. ఈ సాహసి ఇంకొక అడుగు ముందే […]

  • Publish Date - May 17, 2023 / 02:40 AM IST

King Cobra |

విధాత‌: పాములంటేనే హడలెత్తిపోతాం. చిన్నగా ఉన్నా.. విషపూరితం కాదని తెలిసినా భయం మాత్రం అలానే ఉంటుంది. అలాంటి కింగ్‌ కోబ్రా (King Cobra)కనిపిస్తే.. పై ప్రాణాలు పైనే పోవడం ఖాయం. కానీ.. కొందరు సాహసులు ఉంటారు. వారికి కోబ్రాలతో ఆడుకోవడం సరదా! ఎక్కడ ఎవరి ఇళ్లలోనైనా కోబ్రాలు కనిపించినా.. వెళ్లి వాటిని రక్షించి, సమీప అటవీ ప్రాంతాల్లో వదిలివేసే ‘ఫ్రెండ్స్‌ ఆఫ్‌ స్నేక్స్‌’ ఉంటారు.

కానీ.. ఈ సాహసి ఇంకొక అడుగు ముందే ఉన్నాడు. 12 అడుగుల కింగ్‌ కోబ్రాను సింపుల్‌గా ముద్దాడాడు. ఆ పాము కూడా తన స్నేహితుడన్నట్టుగా అతడి చేతిలో ఒదిగిపోయి.. ముద్దు పెట్టేందుకు అవకాశం ఇచ్చింది. ఆ సాహసి చేసిన సాహసం చూసిన నెటిజన్లు నివ్వెర పోతున్నారు. నిక్‌ అనే యూజర్‌ ది వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచాడు.

జంతువులు, పాములతో ఇతను గతంలో కూడా అనేక వీడియోలు చేశాడు. తాజాగా ‘12’ అడుగుల పొడవైన కింగ్‌ కోబ్రాను మీరు ముద్దాడగలరా?’ అనే క్యాప్షన్‌తో వీడియో పోస్ట్‌ చేశాడు. ఆ వీడియోలో ఓ కొలను ఒడ్డున నిక్‌ భారీ కోబ్రాను ఒడుపుగా ఎడమ చేతితో పట్టుకుని అది తనను కాటు వేయకుండా జాగ్రత్తగా కూర్చుని మెల్లగా కోబ్రా పడగపై జాగ్రత్తగా ముద్దు పెట్టాడు.

ఆ సమయంలో అతడు ఆ కోబ్రా సైజు.. దాని పొడవు గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. కొద్ది రోజుల క్రితం పోస్ట్‌ చేసిన ఈ వీడియోకు అతి తక్కవ కాలంలోనే లక్షల కొద్దీ వ్యూస్‌ లభించాయి. అతడి సాహసానికి అనేక మంది సలాం కొట్టారు. ఇటీవలే ఆయన ఓ చిన్న కాపర్‌హెడ్‌ పాముతో ఉన్న వీడియోను పోస్ట్‌ చేశాడు.