Site icon vidhaatha

సంభవ్ స్టీల్ ట్యూబ్స్ లిమిటెడ్.. రూ. 540 కోట్ల ఐపీవో

ముంబయి: సంభవ్ స్టీల్ ట్యూబ్స్ లిమిటెడ్ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) 2025 జూన్ 25న (బుధవారం) ప్రారంభమై 2025 జూన్ 27న (శుక్రవారం) ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 2025 జూన్ 24 (మంగళవారం) బిడ్డింగ్ తేదీగా ఉంటుంది. ఇష్యూ కోసం రూ. 10 ముఖ విలువ చేసే ఒక్కో షేరు ధర శ్రేణి రూ. 77 నుంచి రూ. 82 వరకు ఉంటుంది. కనీసం 182 షేర్లు, ఆ తర్వాత 182 షేర్ల గుణిజాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం ఇష్యూ పరిమాణం రూ. 540 కోట్లుగా ఉండగా, రూ. 440 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనున్నారు.

మరో రూ. 100 కోట్ల విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో సెల్లింగ్ షేర్‌హోల్డర్లు విక్రయించనున్నారు. ఎంప్లాయీ రిజర్వేషన్ పోర్షన్ కింద దరఖాస్తు చేసుకునే అర్హత గల ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ. 4 చొప్పు డిస్కౌంటు లభిస్తుంది. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను నిర్దిష్ట రుణాలను చెల్లించివేసేందుకు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది.

ప్రమోటర్ సెల్లింగ్ షేర్‌హోల్డర్లయిన శశాంక్ గోయల్, రోహిత్ గోయల్ చెరి రూ. 10 కోట్ల వరకు, ప్రమోటర్ గ్రూప్ సెల్లింగ్ షేర్‌హోల్డర్లు కౌసల్య గోయల్ రూ. 35 కోట్ల వరకు, హర్షిత్ గోయల్ రూ. 10 కోట్ల వరకు, ఇతరత్రా సెల్లింగ్ షేర్‌హోల్డరు రింకు గోయల్ రూ. 35 కోట్ల వరకు విలువ చేసే షేర్లను ఓఎఫ్ఎస్ ద్వారా విక్రయించనున్నారు.

Exit mobile version