Site icon vidhaatha

Telangana: రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్‌.. ఉగాది నుంచి సన్న బియ్యం!

Telangana:

విధాత: రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఉగాది నుంచి రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లుగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ నెల 30న సుర్యాపేట జిల్లాలోని నా నియోజకవర్గం హుజూర్ నగర్ పరిధిలోని మఠంపల్లి మండలం శ్రీ లక్ష్మినరసింహస్వామి క్షేత్రం కొలువై ఉన్న మట్టపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి సన్ని బియ్యం పథకాన్ని ప్రారంభించనున్నారని తెలిపారు. ఏప్రిల్‌ 1 నుంచి అన్ని రేషన్‌ షాపుల ద్వారా పంపిణీ చేపడుతామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీ ప్రకారం రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేపడుతుందని తెలిపారు.

సన్న బియ్యం పంపిణీతో 2కోట్ల మంది తెల్ల రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి 6కిలోల చొప్పున అందిస్తారు. ఇప్పటికే పేదలకు కావాల్సిన సన్ని బియ్యం సేకరణ కోసం సన్న ధాన్యం పండించే రైతులకు క్వింటాల్ సన్న ధాన్యానికి రూ.500బోనస్ ఇస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 24లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం కావాలని..ఇందుకు 36లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది. ఏటా రబీ, ఖరీఫ్ లలో రైతుల నుంచి సన్న ధాన్యాన్ని సేకరించి బియ్యంగా మలిచి రేషన్ వ్యవస్థ ద్వారా పేదలకు పంపిణీ చేయనున్నారు.

Exit mobile version