Markapuram:
విధాత: ఒక పాము కనిపిస్తేనే మనుషులు హడలెత్తిపోతుంటారు. అలాంటిది ఒకే చోట కుప్పలు కుప్పలుగా పాముల పిల్లలు బయటపడిన ఘటన చూసినవారికి ఇంకెంత గగుర్పాటు కలిగిస్తుందో చెప్పనవసరం లేదు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో 80 పాము పిల్లలు బయటపడిన ఘటన కలకలం రేపింది.
మార్కాపురం పట్టణ శివారులో 15 రోజుల క్రితం రెండు పాములు గుడ్లు పెట్టాయని స్థానికుల నుంచి స్నేక్ క్యాచర్ నిరంజన్ కు సమాచారం అందింది. అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ 120 పాము గుడ్లను సేకరించి అటవీశాఖ కార్యాలయంలో భద్రపరిచారు.
ఈ రెండు పాములకు చెందిన ఆ గుడ్లను వేర్వేరు డబ్బాల్లో ఇసుకలో ఉంచి, పొదిగించినట్లు నిరంజన్ తెలిపారు. అయితే వాటిలో 80 పాము పిల్లలు బయటకు వచ్చాయన్నారు. ఇప్పుడు ఎందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
పాములు..కుప్పలు కుప్పలు pic.twitter.com/PjupCCZIMk
— srk (@srk9484) March 23, 2025