Site icon vidhaatha

Telangana: నల్గొండలో టెన్త్ పేపర్ లీక్..ఇద్ధరిపై వేటు!

విధాత: నల్గొండ జిల్లాలో టెన్త్ పేపర్ లీక్ ఘటన సంచలనం రేపింది. పేపర్ లీకేజీ ఘటనకు బాధ్యులైన ఇద్ధరి ఉద్యోగులపై వేటు పడింది. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్‌ను ఉద్యోగం నుండి తొలగిస్తున్నట్లుగా జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి ప్రకటించారు. మరో ఇన్విజిలేటర్‌ను కూడా సస్పెండ్ చేశారు. పేపర్ లీకేజీకి సహకరించిన బాలికను కూడా డిబార్ చేశామని డీఈవో తెలిపారు.

నకిరేకల్ పట్టణం కడపర్తి రోడ్ లోని ఎస్ఎల్బీసీ బాలిక గురుకుల పాఠశాల సెంటర్లో తెలుగు పేపర్ లీక్ వ్యవహారంలో డ్యూటీలో ఉన్న అధికారులను బాధ్యులుగా చేస్తూ వారిపై చర్యలు తీసుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తి వచ్చి పరీక్ష కేంద్రంలోని విద్యార్థిని నుంచి ప్రశ్నపత్రం ఫొటో తీసుకొని వెళ్లినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది.

పరీక్షలు ప్రారంభమైన 15 నిముషాలకే తెలుగు ప్రశ్నపత్రం లీకైంది. లీకై న ప్రశ్నాపత్రం ఏకంగా శాలిగౌరారానికి చెందిన పలువురి యువకుల వ్యక్తిగత వాట్సాప్‌లలో ప్రత్యక్షమవ్వడం..వాటికి జవాబులు రాసి పరీక్ష కేంద్రాల్లోకి పంపించే ప్రయత్నం చేయడంతో పేపర్ లీక్ వ్యవహారం వెలుగుచూసింది.

Exit mobile version