క్రీ.శ.1070 కాలంనాటి కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘కంగువ’. సూర్య హీరోగా నటించిన ‘కంగువ’ గతేడాది భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీస్ బరిలో విఫలమయింది. సూర్య నటన బాగుందని అంతా మెచ్చుకున్నా సినిమాలో సన్నివేశాలు గందరగోళంగా ఉండటంతో అందరికీ ఈ మూవీ నచ్చలేదు. వెండితెరపై సూర్య పడిన కష్టానికి తగిన ఫలితం దక్కలేదు. అయితే అంతా ఈ సినిమా గురించి మరిచిపోయిన సమయంలో అనూహ్యంగా ‘కంగువ’ మూవీ 97వ ఆస్కార్ బరిలో నిలిచి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
సౌత్ నుంచి చాలా సినిమాలు 97వ ఆస్కార్ అవార్డు రేసులో పోటీపడ్డాయి. అయితే కేవలం తమిళం నుంచి సూర్య నటించిన ‘కంగువ’, మలయాళం నుంచి పృధ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘ది గోట్ లైఫ్’ (ఆదుకాలం) ఎంపికయ్యాయి. క్రికెట్ ఆటకు వరల్డ్ కప్ ఎంత ప్రాముఖ్యమో సినిమా రంగానికి సంబంధించి ఆస్కార్ అవార్డు అలాంటిది. ఏ నటుడికైనా ఒక్కసారైనా ఆస్కార్ అవార్డు రావడం అనేది ఓ డ్రీమ్ వంటిది. ఇంతకాలం భారతీయ సినిమాలకే అస్కార్ అవార్డు రావడం అందని ద్రాక్షగా మారింది.
కానీ రెండేళ్ల క్రితం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఏకంగా రెండు విభాగాలలో ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకుని భారతీయ చలన చిత్ర చరిత్రను తిరగరాసింది. నాటు నాటు పాట సంగీత దర్శకుడికి, కొరియోగ్రాఫర్ కి అస్కార్ అవార్డులు దక్కాయి. ఇప్పుడు సూర్య నటనకా లేక దర్శకుడికా, లేక కళా దర్శకుడికా, కాస్ట్యూమ్స్ కా అని అంతా భారీగా ఊహించికుంటున్నారు. కేవలం నామినేషన్ కు మాత్రమే అర్హత సాధించింది.