– 30న మరోసారి ఢిల్లీకి రావాలని పిలుపు
Revanth Reddy : హైదరాబాద్, మే 26 (విధాత): తెలంగాణ లో మంత్రివర్గ విస్తరణ మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా ఉంది. పదవుల పంపకంపై స్పష్టత లేకపోవడంతో మరోసారి ఈ నెల 30వ తేదీన ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ అధిష్ఠానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బీ మహేశ్ గౌడ్ లకు సూచించింది. దీంతో రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం తిరిగి హైదరాబాద్ కు బయలుదేరారు.
రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ గత మూడు నాలుగు నెలలుగా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్నది. ఈ పర్యటనలో పదవుల పంపకంపై స్పష్టత వస్తుందని ఎమ్మెల్యేలు ఆశించారు. కాీ చర్చలు తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. 30న మరోసారి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అధిష్ఠానంతో సమావేశం కావాలని నిర్ణయించారు.
ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఢిల్లీలో లేకపోవడంతో టీపీసీసీ కార్యవర్గ నిర్ణయంయం వాయిదా పడింది. 30న మరోసారి ఢిల్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డికి , టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు అధిష్ఠానం పెద్దలు సూచించారు. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి, పీసీసీ అధినేత మంత్రి పదవుల పంపకంపై రాహుల్ గాంధీతో కొద్దిసేప చర్చించారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్ది లేకపోవడంతో చర్చలు వాయిదా వేశారు. మరుసటి సమావేశంలో అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అప్పటి దాకా ఆశావహులు వేచి ఉండక తప్పదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం జూన్ 2 నాటికి మంత్రివర్గ విస్తరణ ముహూర్తం ఖారారు చేసే అవకాశం ఉంది.