Revanth reddy: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ రాజ్ భవన్ లో తేనీటి విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇటీవల మిస్ వరల్డ్ గా ఎంపికైన ఓపల్ సుచాత హాజరయ్యారు. వీరితోపాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సీఎస్, డీజీపీ, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, నిర్మాత దిల్‌రాజు దంపతులు హాజరయ్యారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సంబురాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అన్ని పార్టీల ఆధ్వర్యంలో అవతరణ దినోత్సవాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయం నాటి రోజులను ఆయా పార్టీల నేతలు గుర్తుకు చేసుకుంటున్నారు.